E-Paper
Advertisement

OTT Movie : భార్యకి విడాకులిచ్చి బిడ్డను దత్తత తీసుకునే ఓ తండ్రి కథ… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్

OTT Movie : భార్యకి విడాకులిచ్చి బిడ్డను దత్తత తీసుకునే ఓ తండ్రి కథ… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్
Advertisement

OTT Movie : ఓటీటీలో రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన ‘సింగిల్ పాపా’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. కుణాల్ కెమ్ము లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్ లో డివోర్స్ అయిన ఒక యంగ్ మ్యాన్ సడన్‌గా సింగిల్ ఫాదర్ అవడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. బేబీని చూసుకునే విషయంలో కామెడీ సీన్స్ ఫన్నీగా ఉంటాయి. మనసును హత్తుకునే ఈ సిరీస్ ను ఎందులో చూడవచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

రాహుల్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘సింగిల్ పాపా’ 2025 డిసెంబర్ 12 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హార్ట్‌వార్మింగ్ హిందీ వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్‌తో హిందీ ఒరిజినల్ ఆడియోతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. ఇందులో కుణాల్ కెమ్ము, ప్రజక్తా కోళి, మనోజ్ పావా, నెహా ధూపియా, అయేషా రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఐయండిబిలో 8.1/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గురుగ్రామ్‌లోని సాంప్రదాయ హర్యాన్వీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి గౌరవ్ (కునాల్ కెమ్ము). అతనికి కొత్తగా పెళ్ళి జరగడం, అంతలోనే డివోర్స్ అవ్వడం చక చకా జరిగిపోతాయి. లైఫ్ లో మళ్ళీ మంచిగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు. అయితే సడన్‌గా ఒక రోజు అతని జీవితం తలకిందులవుతుంది. ఒక రోజు తన కారులో వదిలేసిన ఒక బేబీ బాయ్‌ను చూసి, అడాప్ట్ చేసుకుని సింగిల్ ఫాదర్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అడాప్షన్ రూపంలో బేబీ అతని లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇది అతని ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ లేదా ఏదో పాత రిలేషన్ నుంచి వచ్చిన బేబీ కాదు. ఇది అతని వింతైన ఫ్యామిలీ చూసి షాక్ చేస్తుంది.

ఇక అసలు కథ మొదలవుతుంది. ఆ బేబీని చూసుకోవడం అంత ఈజీగా జరగదు. బేబీ ఏడుపు, డైపర్ చేంజ్, ఫీడింగ్, స్లీప్‌లెస్ నైట్స్ అతనితో పాటు, అతని ఫ్యామిలీ కూడా పరుగులు పెడుతుంది. ఇవన్నీ హిలేరియస్‌గా ఉంటాయి. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు కానీ, వాళ్లు కూడా బేబీ కేర్‌లో ఫెయిల్ అవుతూ లాఫ్టర్ సీన్స్ క్రియేట్ చేస్తారు. ఆఫీస్‌లో బాస్, కాలీగ్స్ మధ్య ఈ సీక్రెట్ హైడ్ చేస్తూ గౌరవ్ ఒక ఎమోషనల్ జర్నీ చేస్తుంటాడు. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? ఆ బేబీ అక్కడికి ఎలా వచ్చింది ? గౌరవ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×