E-Paper
Advertisement

OTT Movie : ట్యూషన్ టీచర్‌పై ప్రేమ… ప్రేమించిన వాడు దక్కలేదని ఆ పిల్ల చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : ట్యూషన్ టీచర్‌పై ప్రేమ… ప్రేమించిన వాడు దక్కలేదని ఆ పిల్ల చేసే పనికి ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి బెంగాల్ నేపథ్యంలో సాగే ఒక సరికొత్త సిరీస్ స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇది ఇది వరకే బెంగాల్ లో వచ్చిన ఒక సినిమా ఆధారంగా ఇది రూపొందింది. ఈ కథలో ఒక సాధారణ అమ్మాయి ప్రేమ ఎలా పిచ్చిగా, ఎలా డేంజరస్‌గా మారుతుందో చూపిస్తుంది. మామూలుగా మొదలయ్యే ఈ కథ డార్క్ ఎలిమెంట్స్ తో రివేంజ్ మోడ్ లోకి వెళ్తుంది. రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ స్టోరీలను ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘జిద్ది ఇష్ఖ్’ (Ziddi ishq). రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఆయనే తీసిన 2019 బెంగాలీ సినిమా ‘పరిణీత’ కి రీమేక్ గా వచ్చింది. ఈ సిరీస్ 2025 నవంబర్ 21 శుక్రవారం నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రైలర్ ఇప్పటికే నవంబర్ 8న విడుదలై భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆదితి పోహంకర్, పరంబ్రత చట్టోపాధ్యాయ, సుమీత్ వ్యాస్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మెహుల్ అనే ఒక బెంగాలీ అమ్మాయి ఇంటర్ చదువుతుంటుంది. ఆమెకు ప్రైవేట్ ట్యూషన్ చెప్పే షేకర్ దా మీద చిన్నప్పటి నుంచీ ఇష్టం ఉంటుంది. షేకర్ దా ఆమెకు గురువు మాత్రమే కాదు, ఆమె కలల్లోని హీరో కూడా. ఆ ఇష్టం క్రమంగా ఒక వైపు ప్రేమగా మారుతుంది. మెహుల్ మనసులో షేకర్ లేకపోతే తన జీవితమే లేదని అనిపిస్తుంది. కానీ ఒక రోజు షేకర్ దా ఆకస్మికంగా చనిపోతాడు. పోలీసులు, కుటుంబం అందరూ సూసైడ్ అనుకుంటారు. మెహుల్ అది ఆత్మహత్య అని ఏమాత్రం నమ్మదు. ఆమెకు ఏదో తప్పు జరిగినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి మెహుల్ స్వయంగా దర్యాప్తు మొదలు పెడుతుంది.

Read Also : ఉద్యోగం కోసం వచ్చి ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? గూస్ బంప్స్ తెప్పించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

షేకర్ దా జీవితంలో సీక్రెట్స్, ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటపడతారు. షేకర్ మరణం వెనక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది. అప్పటి వరకు సిగ్గుపడే అమ్మాయిగా ఉన్న మెహుల్ కళ్ల ముందు ప్రపంచం మారిపోతుంది. ఆ బాధ, ఆ కోపం ఆమెను పూర్తిగా మార్చేస్తాయి. ఆమె ప్రతీకారం తీర్చుకునే యోధురాలిగా మారిపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ మరింత ఉత్కంఠంగా ఉంటాయి. చివరికి షేకర్ దా ఎలా చనిపోయాడు ? మెహుల్ తెలుసుకున్న సీక్రెట్స్ ఏమిటి ? ఆమె రివేంజ్ ఎవరి మీద తీర్చుకుంటుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×