E-Paper
Advertisement

OTT Movie : దేవుడి పేరుతో దిక్కుమాలిన పనులు… అమ్మాయిలను వదలకుండా… మతిపోగోట్టే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : దేవుడి పేరుతో దిక్కుమాలిన పనులు… అమ్మాయిలను వదలకుండా… మతిపోగోట్టే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొన్ని రియల్ స్టోరీలు సినిమాల ద్వారానే ప్రజలకు తెలుస్తుంటాయి. నాగరికతలో వచ్చిన అనాగరికమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కనుమరుగైతే, మరి కొన్ని సినిమాల ద్వారా తెలుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఐర్లాండ్‌లో 1996 వరకు నడిచిన చర్చి నడిపే జైళ్ల లాంటి ఆశ్రమాల నేపథ్యంలో తెరకెక్కింది. అక్కడ జరిగిన భయంకరమైన అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఆస్కార్ విన్నర్ సిల్లియన్ మర్ఫీ నటించిన ఈ ఐరిష్ డ్రామా కేవలం 96 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా స్టోరీ మరింత ఇంటెన్స్ గా ఉంటుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘స్మాల్ థింగ్స్ లైక్ దిస్’ 2024లో టిమ్ మిలెంట్స్ దర్శకత్వం వహించిన హిస్టారికల్ సినిమా. ఇందులో సిలియన్ మర్ఫీ, ఎలీన్ వాల్ష్, మిచెల్ ఫెయిర్లీ, ఎమిలీ వాట్సన్, క్లేర్ డున్నే నటించారు. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 5న 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ అయింది. 2024 నవంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఐయండిబిలో 6.7/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1985 లో క్రిస్మస్ సమయం వస్తుంది. ఐర్లాండ్‌లోని ఒక చిన్న టౌన్‌లో బొగ్గు వ్యాపారి బిల్ ఫర్లాంగ్, తన భార్య ఐదుగురు పిల్లలతో సంతోషంగా ఉంటాడు. రోజూ బొగ్గు వ్యాపారం చేస్తూ, చిన్న చిన్న సంతోషాల్లో జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు స్థానిక కాన్వెంట్ (చర్చి ఆశ్రమం)కి బొగ్గు ఇవ్వడానికి వెళ్తే… అక్కడ ఒక యువతి ఏడుస్తూ, సహాయం అడుగుతూ కనిపిస్తుంది. ఆమెను ఎవరో బలవంతంగా లాక్ చేసి ఉంటారు. ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుని బిల్ షాక్ అవుతాడు. అక్కడ పాపం చేసిన అమ్మాయిలను, ముఖ్యంగా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్లను బానిసల్లా పని చేయిస్తుంటారు. వాళ్ళను హింసిస్తూ ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతుంటారు.

Read Also : డబ్బులిచ్చి చిన్న పిల్లతో పెళ్లి… ఈ బంగారు తల్లికి వచ్చిన కష్టం ఇంకే ఆడపిల్లకు రావొద్దు భయ్యా

ఆ రహస్యం బయటపడితే పట్టణమంతా తలకిందులవుతుంది. బిల్ మౌనంగా ఉండాలా? లేక గొంతు ఎత్తాలా? అనే పోరాటం మొదలవుతుంది. ఎందుకంటే ఆ టౌన్‌లో చర్చి అంటేనే అందరూ భయపడతారు. ఎవరైనా మాట్లాడితే ఉద్యోగం పోతుంది, కుటుంబం రోడ్డున పడుతుంది. బిల్ భార్య ఐలీన్ కూడా మనకెందుకు అని అంటుంది. కానీ బిల్ దీని మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకుంటాడు. ఎందుకంటే అతను పుట్టినప్పుడు, అతని అమ్మను కూడా ఇలాంటి ఆశ్రమంలో పెట్టి ఉంటారు. ఇప్పుడు అతన్ని ఆ గతం మళ్లీ వెంటాడుతుంది. చివరికి ఒక చిన్న మనిషి ఎలా ధైర్యం చేసి నిలబడతాడు ? చర్చి అరాచకాలను ఎలా బద్దలు కొడతాడు ? అనే విషయాలతో మూవీ మొత్తం ఒక ఎమోషన్ లా సాగుతుంది.
Advertisement

 

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×