E-Paper
Advertisement

Social Drama OTT : టీ అమ్ముకునే వాడి కూతురిపై అఘాయిత్యం… కంటతడి పెట్టించే సోషల్ డ్రామా

Social Drama OTT : టీ అమ్ముకునే వాడి కూతురిపై అఘాయిత్యం… కంటతడి పెట్టించే సోషల్ డ్రామా
Advertisement

Social Drama OTT : ఓటీటీలలో అతి తక్కువ అందుబాటులో ఉండే జానర్ సినిమాలలో సోషల్ డ్రామాలు ముందు వరుసలో ఉంటాయి. నిజానికి స్టోరీ కనెక్ట్ అయ్యేలా ఉంటే తప్ప ఇలాంటి సినిమాల వైపు జనాలు అట్రాక్ట్ కారు. కానీ ఎంగేజింగ్ గా ఉంటే మాత్రం జనాల ఆదరణతో దూసుకెళ్తాయి. అలా ఓటీటీని షేక్ చేసిన ఓ మంచి సినిమా ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2023లో విడుదలైన తమిళ్ సోషల్ డ్రామా బొమ్మై నాయగి (Bommai Nayagi). దర్శకుడు షాన్ ఈ సినిమాతోనే డెబ్యూ చేశారు. నీలం ప్రొడక్షన్స్ బ్యానర్ పై పా. రంజిత్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో యోగి బాబు హీరోగా నటించారు. ఆయన పాత్ర పేరు వేలు – టీ షాప్ మాస్టర్. అతని కూతురు బొమ్మై నాయగి, భార్య కూడా ఉంటారు. హరి కృష్ణన్, లిజ్జీ ఆంటోనీ, అరుల్ దాస్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సుందరమూర్తి కెఎస్ సంగీతం అందించారు. 2 గంటల 5 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2023 ఫిబ్రవరి 3న థియేటర్స్‌లో రిలీజ్ అయి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. IMDb 7.6 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. తమిళ్ లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సోషల్ మెసేజ్ ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు.

Advertisement

Read Als0 :  భార్య ఉండగానే ప్రియురాలితో… మర్డర్ మిస్టరీలో మతిపోగొట్టే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

కథ 1990ల ప్రారంభంలో కడలూర్ పట్టణంలో జరుగుతుంది. వేలు (యోగి బాబు) ఇందులో హీరో. అతను ఒక టీ షాప్ లో టీ మాస్టర్ గా పని చేస్తూ, టీ అమ్ముకుంటాడు. తన భార్యా పిల్లలతో కలిసి సింపుల్ లైఫ్ గడుపుతాడు. అతని భార్య పేరు కయల్విజి (సుబత్రా), 9 ఏళ్ల కూతురు బొమ్మై నాయగి (శ్రీమతి) ఇదే తన ప్రపంచం. వేలు తల్లి తక్కువ కాస్ట్ నుంచి వచ్చింది. అతని సవతి సోదరుడు సెంథిల్ (అరుల్ దాస్) మాత్రం బాగా రిచ్. కానీ అతను అన్న వేలును చిన్నచూపు చూస్తూ దూరంగా ఉంచుతాడు. టీ షాప్ ఓనర్ అనారోగ్యం పాలు కావడంతో వేలు జాబ్ పోతుంది. అయితే ఆ షాప్ లో జాబ్ పోతే పోయింది, కనీసం సిట్యుయేషన్ ను వాడుకుని దానికి ఓనర్ కావాలన్నా కష్టమే. షాప్ ను కొనాలంటే ఏకంగా లక్ష రూపాయలు కావాలి. టీ అమ్ముకుని బతికే వేలుకు లక్ష రూపాయలు సమకూర్చడం అంటే చాలా కష్టం.

Advertisement

ఇదిలా ఉండగా, బొమ్మై నాయగి ఓ పండగ జరుగుతున్న తరుణంలో దేవుడికి తన పిగ్గీ బ్యాంక్ డబ్బును సమర్పించడానికి ఇంటికి వెళ్తుంది. తిరిగి వస్తున్నప్పుడు జర్నీలో ఇద్దరు తప్ప తాగిన అప్పర్ కాస్ట్ వాళ్ళు ఆ పాపపై అఘాయిత్యానికి తెగబడతారు. ఈ దారుణమైన ఘటనతో ఆ పాప కళ్ళు తిరిగి పడిపోతుంది.
దీంతో ఆమెను హాస్పిటల్‌ కు తీసుకెళ్తారు. ఆ హాస్పిటల్ ఏమో ఘాతుకానికి పాల్పడ్డ మనుషుల ఓనర్స్‌దే. వేలు తన కూతురుకు జరిగిన అన్యాయానికి కుంగి పోకుండా న్యాయం కోసం పోరాడతాడు. మరి వేలుకు న్యాయం జరిగిందా ? ఆ పాప సంగతి ఏమైంది ? చివరికి క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×