E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దొరికిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. అయ్యో బాలు పాపం..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దొరికిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. అయ్యో బాలు పాపం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. పోటీలో ఓడిపోయామని రవి, శృతి ఇద్దరూ కూడా బాధ పడిపోతూ ఉంటారు. నువ్వంటే నువ్వని ఒకరిపై ఒకరు తిట్టుకుంటారు.. ఇక బాలు మీనా మాత్రం రొమాన్స్ కు వేల అయిందని ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. బాలు మీనాని పొగుడుతూ పాటలు పాడుతూ తనని ఇంప్రెస్ చేసేస్తాడు. మీకా తర్వాత మనము ఒక రూమును కట్టుకోవాలి లేకుంటే మనమధ్య దూరం పెరిగేలా ఉంది అని బాలు అంటాడు.. ఇక రూము వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని బాలు అంటాడు. మీనాతో ఎప్పుడెప్పుడు రొమాన్స్ చేద్దామని బాలు ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు.. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి విలన్ చూసి షాక్ అవుతుంది.. మీనా తన వంట గురించి బాలు ఏం చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ బాలు మాత్రం ఏం చెప్పకుండా పెళ్లి పోవడంతో అతని బాక్సులో పెట్టిన ఫుడ్ని చూసి బాలు షాక్ అవుతాడు.. రోహిణి చింటూ కోసం బట్టలు కొనడానికి షాప్ కి వెళ్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా చేసిన బీట్ రూట్ దోస గురించి బాలు మాత్రం ఏది చెప్పకుండా వెళ్ళిపోతాడు. అయితే మీనా జరిగిన విషయన్ని వాళ్ళతో చెప్తుంది నీకు ఇంకొక అవకాశం ఇస్తామని వాళ్లంటారు. మీ నాకు వాళ్ళు ఇంకొక అవకాశం ఇస్తారు.. ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు చేసిన దోస ఎలా ఉందో అడుగు అని అంటారు. మీనా ఫోన్ చేసి అడుగుతుంది.. పొద్దున మీకోసం ఒక దోస చేశాను. అది ఎలా ఉంది నాకు చెప్పనేలేదు.. ఎలా ఉందండి అని నేను అడుగుతుంది.. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను కదా నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు అని బాలు సీరియస్ అవుతాడు..

Advertisement

నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయని తెలుసు కదా మరి నువ్వు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశావు అని బాలు అనగానే మీనా షాక్ అవుతుంది. చూసావా మీనా మీ ఆయన కూడా మా ఆయన లాగానే అని అక్కడున్న వాళ్ళందరూ అనగానే మీనా సరే అక్క ఇదిగోండి 500 అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. కామాక్షి దగ్గరికి వెళ్ళిన ప్రభావతి అందరూ సంపాదిస్తూనే ఉన్నారు నేను మాత్రం ఏమి సంపాదించట్లేదు నాకు ఇంట్లో అవమానంగా ఉంది అని ఫీల్ అవుతుంది. నేను డాన్స్ స్కూల్ పెట్టాను కదా కాస్త డబ్బులు సంపాదిస్తేనే నాకు విలువ ఉంటుంది మర్యాద ఉంటుంది అని ప్రభావతి ఫీల్ అయిపోతూ ఉంటుంది..

డాన్స్ స్కూల్ కి స్టూడెంట్స్ రావడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది అని కామాక్షి అంటుంది.. మనము మొదటి నెల స్టూడెంట్స్ కి ఫ్రీ గా ఇస్తాము. వాళ్ళు వేసుకునే డ్రెస్ ని మనమే అమ్మి అక్కడ ఆ డబ్బులు వసూలు చేద్దాము అని కామాక్షి సలహా ఇస్తుంది. ఆ సలహాతో ప్రభావతి ఫుల్ ఖుషి అవుతుంది.. నువ్వు చెప్పింది నిజమే కామాక్షి ఇలా చేస్తే కచ్చితంగా స్టూడెంట్స్ రావడంతో పాటుగా మనకి మంచి డబ్బులు కూడా వస్తాయి ఎక్కడ నష్టం ఉండదు అని అంటుంది. సరే వెళ్దాం పద వదిన మనం వెళ్లి ఆ నాట్యం డ్రస్సులను కొందాం పదండి అని అంటుంది.

Advertisement

బాలు రాజేష్ దగ్గరికి వచ్చి ట్రిప్ గురించి మాట్లాడుతాడు. మంచి కస్టమర్ పాడ ఆ రోడ్డు మీద ఇంకొక నాలుగు సార్లు కార్ తిరిగితే కారు షెడ్డు కి వెళ్తుంది అని పాలు అంటాడు. సరే ఆకలేస్తుంది భోజనం చేద్దాం అనేసి రాజేష్ బాలు ఇద్దరు కూడా భోజనం చేయడానికి వెళ్తారు.. అక్కడ రాజేష్ బాక్స్ ఓపెన్ చేయగానే పచ్చడి పెరుగు కనిపించడంతో రోజు మా ఆవిడ నన్ను చంపేస్తుంది. చేయడానికి బద్దకమో తెలియట్లేదు చేయలేక తెలియట్లేదు అని అంటాడు.. మీ ఆవిడ మావిడి లాగా కాదు చాలా మంచిది అని పొగిడేస్తాడు.. ఏం ఫీల్ అవ్వకురా మీనా చాలా మంచిది నా కోసం ఏదో ఒకటి చేసి పెట్టి ఉంటది అది వేసుకుందులే అనేసి అంటాడు బాలు. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి రా అని రాజేష్ అంటాడు..

ఇక బాక్స్ ఓపెన్ చేయకనే దోశ పిండి చట్నీకి పల్లీలు, పచ్చిమిరపకాయలు అందులో కనిపిస్తాయి.. ఇదేంటి దోశ పిండి పల్లీలు ఉన్నాయి అని బాలు షాక్ అవుతాడు.. నువ్వు ఏం చేసావో చెప్పరా లేకపోతే మీనా ఇలా చెయ్యదు కదా అని రాజేష్ అంటాడు. పొద్దున నా వెనకాల తిరిగింది ఏది అనుకో నాకు అర్థం కాలేదు నేను ట్రిప్ ఉందని వచ్చేసాను అని బాలు అంటాడు. మనం వాళ్ళకి ఏ గిఫ్ట్ లు ఇవ్వకపోయినా వాళ్ళ వంటని మెచ్చుకోవాలని అనుకుంటారు. నువ్వు అదే చేయలేకపోయావు కదా అందుకే నీకు ఇలాంటి జరిగింది అని రాజేష్ అంటాడు.

మరి ఈ గండం నుంచి బయట ఎలా పడాలి రా అని రాజేష్ ని బాలు అడుగుతాడు. మరేం లేదురా వాళ్లకి ఇష్టమైనవి ఏవో తెలుసుకొని వాటిని తీసుకొని వెళ్లి గిఫ్ట్ గా ఇస్తే ఆ కోపం కాస్త మాయం అయిపోతుంది అని రాజేష్ సలహా ఇస్తాడు. బాలు అలానే అని ఇంటికి వెళ్ళిపోతాడు.. రోహిణి చింటూ తో ఫోన్ మాట్లాడిన విషయం మనోజ్ కి తెలిసిపోతుంది. చింటూ సంతోషం కోసం ఏదీ చేయలేదు కనీసం వాటి పుట్టినరోజునేనా చేయలేని రోహిణి అనుకుంటుంది. తనకు బట్టలు కొనాలని షాప్ కి వెళ్తుంది.. అక్కడ చింటూ కి ఫోన్ చేసి ఎలాంటి డ్రెస్ కావాలో అని రోహిణి అడిగి మరి కొంటుంది.

అదే షాప్ కి ప్రభావతి కామాక్షి వస్తారు. కౌంటర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు వాళ్ళు కనిపిస్తారు. అక్కడున్న షాప్ కీపర్ చింటూ కోసం తీసుకున్న డ్రెస్ ని అతను తెచ్చి మీ కొడుకు కోసం మంచి డ్రెస్ తీసుకున్నారు మేడం ఇదిగోండి అని కౌంటర్లో ఇస్తాడు. మీరు పొరపాటు పడినట్టున్నారు మా కోడలికి ఇంకా పిల్లలు పుట్టలేదు అని ప్రభావతి అంటుంది.. అయితే ప్రభావతి కి రోహిణి దొరికిపోయింది. క్లయింట్ వాళ్ళ పిల్లలు అని రోహిణి మ్యానేజ్ చేసుకుంది. ప్రభావతి బిల్లు కూడా రోహిణినే కడుతుంది.

Also Read :డార్లింగ్ ఫ్యాన్స్ కు న్యూయర్ గిఫ్ట్ అదిరింది.. ప్రభాస్ ఏమున్నాడ్రా బాబు..!

భోజనం చేద్దామా అని కామాక్షి అనగానే రోహిణి పక్కనే ఉన్న రెస్టారెంట్ బాగుంటుంది అక్కడికి కుందాం పదండి అని అంటుంది. అక్కడికి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అంటే ప్రభావతి రోహిణి పెడుతుంది అని అంటుంది.. ఇక బాలు మీనా కోసం ఒక చీరను గిఫ్ట్ గా తీసుకొని వస్తాడు. అయినా కోపంగా ఉండడం చూసి షాక్ అవుతాడు.. బయట వేరే ఫ్రెండ్ కలిసి తిందాం అంటే బయట తిన్నాము బాక్స్ తినలేదు అని అనగానే మీనా అవునా అని అంటుంది.. ఇక బాలు తెచ్చిన చీరని మీనా కట్టుకొని వస్తుంది.. అది చూసి బాలు మురిసిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×