E-Paper
Advertisement

మనసున్న మనుషుల కోసం తీసిన గొప్ప సినిమా… ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ

మనసున్న మనుషుల కోసం తీసిన గొప్ప సినిమా… ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ
Advertisement

Social Drama OTT : ఓటీటీలోకి పక్కా సోషల్ డ్రామాతో మంచి మెసేజ్ ఇస్తుంటాయి కొన్ని సినిమాలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో మెసేజ్ తో పాటు అన్ని హంగులు ఉంటాయి. ఇందులో ఒక సోషల్ మెసేజ్, దాని చుట్టూ అల్లిన ప్రేమకథ, మనుషుల మధ్య ఉండే సున్నితమైన ఎమోషన్స్, చివరికి కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. కేవలం డబ్బుంటే సరిపోదు, మనసు కూడా ఉండాలని, మనుషుల మధ్య ఉండే సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ సినిమా చూపిస్తుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2023లో వచ్చిన ఈ  బెంగాలీ సోషల్ డ్రామా సినిమా పేరు ‘మనోబ్జోమిన్’ (Manobjomin). ప్రముఖ బెంగాలీ కవి శ్రీజాతో ఈ సినిమాతోనే మొదటిసారి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన కవిత్వంలోని సున్నితత్వం ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో సీనియర్ నటుడు పరాన్ బందోపాధ్యాయ పోషించిన ‘బరేన్ బాబు’ పాత్ర సినిమాకి ప్రాణం పోసింది. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాగే మరో ప్రముఖ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం.ఇక జాయ్ సర్కార్ అందించిన సంగీతం కథలోని ఫీల్‌ను బాగా పెంచింది. ఈ సినిమాను రానా సర్కార్ నిర్మించారు, ఆయన గతంలో ఎన్నో మంచి సామాజిక సందేశాత్మక చిత్రాలను అందించారు. ప్రస్తుతం ఈ సినిమా Hoichoi (హోయిచోయ్) ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అలాగే Amazon Prime Videoలో కూడా ఈ సినిమాను చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కుహు, సంకేత్ అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుహుకి ఒక మంచి ఆశయం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లల కోసం, ముఖ్యంగా అమ్మాయిల కోసం ఏదైనా చేయాలని ఒక NGO కూడా నడుపుతుంటుంది. సంకేత్ ఒక బ్యాంకులో పనిచేస్తూ, తన ప్రేయసి ఆశయానికి తోడుగా ఉంటాడు. వీళ్లిద్దరూ కలిసి ఆ పిల్లల కోసం ఒక స్కూల్ కట్టాలని ఫిక్స్ అవుతారు. స్కూల్ కట్టాలంటే ఊరికే అవ్వదు కదా, బోలెడంత డబ్బు కావాలి. వీళ్ల దగ్గరేమో చిల్లిగవ్వ లేదు. అప్పుడు వీళ్లకి బరేన్ బాబు అనే ఒక ముసలాయన తగులుతాడు. ఆయన దగ్గర బోలెడంత ఆస్తి ఉంటుంది కానీ, మనిషి మాత్రం చాలా గడసరి, కొంచెం పిసినారి కూడా. ఆ ముసలోడిని ఒప్పించి, ఆయన్నుంచి ఫండ్స్ రాబట్టడానికి వీళ్లు పడే పాట్లు, చేసే ప్రయత్నాలు భలే కామెడీగా, ఎమోషనల్‌గా సాగుతాయి. చివరికి వీళ్ళు ఆ స్కూల్ కట్టారా? ఆ ముసలాయన మనసు మారిందా? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : అలా మొదలైన ముప్పై ఏళ్ల దాంపత్యం… ఆకట్టుకుంటున్న ఎమోషనల్ డ్రామా

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×