E-Paper
Advertisement

అలా మొదలైన ముప్పై ఏళ్ల దాంపత్యం… ఆకట్టుకుంటున్న ఎమోషనల్ డ్రామా

అలా మొదలైన ముప్పై ఏళ్ల దాంపత్యం… ఆకట్టుకుంటున్న ఎమోషనల్ డ్రామా
Advertisement

Feel Good Drama OTT: ఓటీటీలోకి ఒక హాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల మధ్య ఉండే చిన్నపాటి గొడవలతో ఆకట్టుకుంటుంది. ఒక రిటైర్డ్ దంపతులు ఆమ్‌స్టర్‌డామ్ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళ బంధం ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నగరంలో జరిగింది. అక్కడి చారిత్రక ప్రదేశాలను సినిమాలో చాలా అందంగా చూపించారు ఇందులో. సినిమా చూస్తున్నంత సేపు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాను ముఖ్యంగా క్లాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, ఎమోషన్స్ కథలను కోరుకునే వాళ్ళు తప్పక చూడాల్సిన చిత్రంగా చెప్పుకోవచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ హాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘మిడ్ వింటర్ బ్రేక్’ (Midwinter Break).  దర్శకురాలు పాలీ ఫిండ్లే ఇందులో ఎమోషన్స్ ను చాలా రియలిస్టిక్ గా చూపించారు. సినిమా నిడివి కూడా కేవలం 91 నిమిషాలు మాత్రమే ఉండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన లెస్లీ మాన్విల్లే, కియారన్ హిండ్స్ తమ నటనతో ప్రాణం పోశారు. ఇది బెర్నార్డ్ మాక్ లెవర్టీ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇది 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా Peacock స్ట్రీమింగ్ సర్వీస్‌లో 2026 ఏప్రిల్ 10 నుండి అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడే చూడాలనుకుంటే, Amazon Prime Video, Apple TV, Google Play Movies ప్లాట్‌ఫామ్‌లలో అద్దెకు తీసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

స్టెల్లా, గెర్రీ అనే భార్యాభర్తలు రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉంటున్నట్లు కనిపిస్తారు. కానీ వాళ్ళు లోపల ఎన్నో ఏళ్లుగా అసంతృప్తితో ఉంటారు. అయితే ఈ వయసులో కాస్త ఎంజాయ్ చేద్దామని వీళ్ళు ఆమ్‌స్టర్‌డామ్ టూర్ వెళ్తారు. అక్కడ గెర్రీకి ఉన్న తాగుడు అలవాటు వల్ల, అతను చేసే వెధవ పనుల వల్ల స్టెల్లాకు చిర్రెత్తుకొస్తుంది. బయటికి అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య ఉన్న అసలు గ్యాప్ ఆ ట్రిప్‌లో బయటపడుతుంది. స్టెల్లాకు దేవుడంటే భక్తి, పద్ధతిగా ఉండాలనుకుంటుంది. కానీ గెర్రీకి మాత్రం పొద్దున లేచింది మొదలు మందు గ్లాసు పట్టుకోవడమే పని.

ఒక పక్క తను భక్తి మార్గంలో వెళ్లాలనుకుంటే, మరోపక్క మొగుడు తాగి తందనాలాడటం చూసి ఆమె విసిగిపోతుంది. ఆమ్స్టర్‌డామ్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు, తన జీవితాన్ని ఇలాగే ఈ తాగుబోతుతో గడిపేయాలా లేక తన దారి తాను చూసుకోవాలా అని ఆమెకు పెద్ద డైలమా మొదలవుతుంది. ఇక చాలా ఏళ్లుగా మనసులో దాచుకున్న కోపాలు, బాధలు అన్నీ ఒక్కసారిగా పేలిపోతాయి. గత తప్పులు తవ్వుకుంటూ ఒకరినొకరు కడిగేసుకుంటారు. చివరకు ఇన్నేళ్ల బంధాన్ని తెంచుకోలేక, అలాగని కలిసి ఉండలేక వాళ్ళు పడే ఆవేదన ఈ సినిమా.

Advertisement

Read Also : ఓటీటీని వణికిస్తున్న హారర్ ఫ్రాంచైజీలు… వీటి పోస్టర్ చూస్తేనే మీలో భయం పడుతుంది

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×