E-Paper
Advertisement

దాని కోసం పరాయి వ్యక్తులకు అమ్ముడుపోయిన విద్యార్థిని… ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా

దాని కోసం పరాయి వ్యక్తులకు అమ్ముడుపోయిన విద్యార్థిని… ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా
Advertisement

Social Drama Movie OTT :చదువు కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయి జీవితం ఊహించని దారిలోకి వెళ్తే ఎలా ఉంటుంది? కాలేజీ క్లాస్ రూమ్స్, పుస్తకాలు, పరీక్షల మధ్య సాగాల్సిన జీవితం ఒక్కసారిగా డబ్బు సమస్యలతో చీకటిగా మారితే ఏం జరుగుతుంది? బయటకు సాధారణ విద్యార్థిలా కనిపించినా, లోపల ప్రతి రోజు మానసిక ఒత్తిడితో బతకాల్సి వస్తే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఎమోషనల్‌ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన సినిమా స్టూడెంట్ సర్వీసెస్‌(Student Services). పరిస్థితులు మనిషిని ఎంతవరకు మార్చగలవో చూపించే కథ ఇది.

ఎక్కడ చూడచ్చంటే?

2010లో విడుదలైన ఈ ఫ్రెంచ్ డ్రామా సినిమా ప్రస్తుతం ప్రైమ్‌ వీడియో(Prime Video)లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి ఎమ్మాన్యుయేల్ బెర్కోట్ దర్శకత్వం వహించారు. డెబోరా ఫ్రాంకోయిస్ ప్రధాన పాత్రలో నటించారు. నిజ జీవిత అనుభవాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా విడుదల సమయంలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక యువతి ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని చాలా సహజంగా చూపించారు. సినిమాలో ఎక్కడా అతిగా డ్రామా చూపించకుండా, వాస్తవానికి దగ్గరగా కథను ముందుకు తీసుకెళ్లడాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి.

కథేంటి?

Advertisement

లారా అనే యువతి కాలేజీలో చదువుకుంటూ ఒంటరిగా జీవిస్తుంది. మొదట ఆమె జీవితం అందరిలాగానే సాగుతుంది. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించాలనే ఆశతో ముందుకు సాగుతుంది. అయితే కొద్దికాలానికి ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. హాస్టల్ ఫీజులు, కాలేజీ ఖర్చులు, రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇంటి నుంచి కూడా పెద్దగా సహాయం అందదు. ఈ పరిస్థితిలో లారా చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంది. కానీ వచ్చిన డబ్బు సరిపోదు.. అప్పులు పెరుగుతాయి. ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. ఒక దశలో డబ్బు కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. పెద్ద వయసు వ్యక్తులకు శారీరక సేవలు అందించే మార్గంలోకి వెళ్లిపోతుంది.

మొదట అది తాత్కాలికంగా అనిపించినా, క్రమంగా అదే ఆమె జీవితంలో భాగంగా మారిపోతుంది. బయటకు చూస్తే ఆమె సాధారణ విద్యార్థిలా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ప్రతి రోజు మానసికంగా కుంగిపోతూ ఉంటుంది. ఒకవైపు చదువు కొనసాగించాలి. మరోవైపు జీవితం నెట్టుకురావాలి. ఈ రెండు మధ్య ఆమె తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆమె కలిసే వ్యక్తులు, ఎదురయ్యే పరిస్థితులు కథను మరింత భావోద్వేగంగా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో బయటపడాలని ప్రయత్నించినా పరిస్థితులు ఆమెను మళ్లీ అదే దారిలోకి నెడతాయి. డబ్బు కోసం తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ సినిమా కళ్లకు కడుతుంది. ఇక సమాజం బయట నుంచి చూసే విద్యార్థి జీవితానికి, నిజంగా కొంతమంది ఎదుర్కొనే కఠిన పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను ఈ సినిమా చాలా బలంగా చూపిస్తుంది. భావోద్వేగం, వాస్తవికత కలిసిన కథగా ఈ సినిమా ఆడియెన్స్‌కు చాలా దగ్గరైంది.

Advertisement

Read Also : అప్పుల్లో కూరుకుపోయి ఆత్మతో ఆటలు… చేతబడితో వణికించే డెడ్లీ డెత్ ట్రాప్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×