E-Paper
Advertisement

నిద్రలేవగానే ఒళ్లు నొప్పులా ? మీరు చేస్తున్న ఈ 5 తప్పులే కారణం!

నిద్రలేవగానే ఒళ్లు నొప్పులా ? మీరు చేస్తున్న ఈ 5 తప్పులే కారణం!
Advertisement

Morning body pain causes: ఉదయం నిద్రలేవగానే ఉత్సాహంగా ఉండాల్సింది పోయి. ఒళ్లు నొప్పులు, నడుము పట్టేయడం లేదా మెడ నొప్పితో సతమతమవుతున్నారా? అయితే మీరు రాత్రి పడుకునే ముందు లేదా నిద్రలో చేసే కొన్ని అలవాట్లే ఇందుకు కారణం కావచ్చు. చాలా మంది ఈ నొప్పులను వయసు రీత్యా వచ్చేవిగా లేదా పని ఒత్తిడి వల్ల కలిగేవిగా భావిస్తారు. కానీ.. మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే 5 అలవాట్లు మన వెన్నెముక, కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకుంటే ప్రతి ఉదయం హాయిగా మారుతుంది.

ఉదయం ఒళ్లు నొప్పులకు కారణమయ్యే 5 సాధారణ అలవాట్లు :

Advertisement

రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం రిపేర్ మోడ్‌లో ఉంటుంది. అంటే కండరాలు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజుకు సిద్ధమవుతాయి. కానీ.. మన తప్పుడు అలవాట్ల వల్ల శరీరం విశ్రాంతికి బదులు ఒత్తిడికి గురవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.తప్పుడు స్లీపింగ్ పొజిషన్:
చాలా మంది బోర్లా పడుకుంటారు (కడుపుపై ఒత్తిడి పడేలా). ఇది వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. ఇలా పడుకోవడం వల్ల మెడ ఒక వైపుకు తిరిగి ఉంటుంది, దీనివల్ల ఉదయం లేవగానే మెడ పట్టేయడం లేదా భుజాల నొప్పులు వస్తాయి. అలాగే.. వెల్లకిలా పడుకున్నప్పుడు కాళ్ల కింద చిన్న దిండు లేకపోయినా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

2. నాణ్యత లేని పరుపు, దిండు:
మీరు వాడే పరుపు మరీ మెత్తగా ఉన్నా లేదా మరీ గట్టిగా ఉన్నా వెన్నెముక యొక్క సహజమైన ఆకృతి దెబ్బతింటుంది. పరుపు పాతదైపోయి మధ్యలో గుంటలు పడితే.. అది మీ కండరాలకు సరైన సపోర్ట్ ఇవ్వదు. అలాగే.. చాలా ఎత్తైన దిండు వాడటం వల్ల మెడ ఎముకలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన తలనొప్పికి కూడా దారి తీస్తుంది.

3. డీహైడ్రేషన్ :
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తాయి. మన కండరాలు, కీళ్ల మధ్య ఉండే ద్రవం సరిగ్గా ఉండాలంటే నీరు అవసరం. రాత్రి పూట తగినంత నీరు తాగకుండా పడుకుంటే.. కండరాలు బిగుసుకుపోయి ఉదయం లేవగానే నొప్పిగా అనిపిస్తుంది.

4.పడుకునే ముందు ఫోన్ వాడటం :
పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల మెడ వంగి ఉంటుంది. దీనిని ‘టెక్ నెక్’అంటారు. ఈ పొజిషన్‌లో ఎక్కువ సేపు ఉండటం వల్ల మెడ, వెన్ను పైభాగంలోని కండరాలు అలసిపోతాయి. నిద్రలో కూడా ఆ ఒత్తిడి అలాగే ఉండి.. ఉదయం లేవగానే తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

Also Read: ఆల్కహాల్‌తో కలిపి పొరపాటున కూడా.. ఈ స్నాక్స్ తినొద్దు

5. వ్యాయామం లేకపోవడం లేదా విపరీతమైన ఒత్తిడి :
రోజంతా ఒకే చోట కూర్చుని పని చేసే వారిలో కండరాలు దృఢత్వాన్ని కోల్పోతాయి. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా లేనప్పుడు.. నిద్రలో చిన్నపాటి కదలికలకే అవి పట్టేస్తాయి. అలాగే.. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం తెలియకుండానే నిద్రలో దవడలను, కండరాలను బిగబడతాము. ఇది ఉదయం బాడీ పెయిన్స్‌కు ప్రధాన కారణం అవుతుంది.

పరిష్కారం ఏంటి?

1.వీలైనంత వరకు పక్కకు తిరిగి పడుకోండి, మోకాళ్ల మధ్య చిన్న దిండు ఉంచుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.

2.ప్రతి 7-8 ఏళ్లకు ఒకసారి మీ పరుపును మార్చండి.

3.పడుకునే ముందు తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి.

4. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి.

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×