E-Paper
Advertisement

లెక్కల కంటే లైఫ్ చాలా కష్టం… ముగ్గురు మురికివాడ పిల్లల రియల్ స్టోరీ

లెక్కల కంటే లైఫ్ చాలా కష్టం… ముగ్గురు మురికివాడ పిల్లల రియల్ స్టోరీ
Advertisement

Social Drama OTT : సోషల్ డ్రామాలు ఎక్కువగా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. సమాజానికి ఉపయోగ పడే మంచి మెసేజ్ ఇస్తుంటాయి కూడా. ఈ జానర్ సినిమాలు ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే బెంగాలీ మూవీ మాత్రం మీ హార్ట్ ను కచ్చితంగా టచ్ చేస్తుంది. ఈ సినిమా ముగ్గురు పిల్లల స్నేహం, వాళ్ళు కనే కలల చుట్టూ తిరుగుతుంది. ఐయండిబిలో 7.5 రేటింగ్ ఉన్న ఈ రియల్ స్టోరీని పిల్లలతో కలసి చూస్తే మరింత బాగుంటుంది. చేతిలో కర్చీఫ్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే ఈ మూవీ చూసేటప్పుడు కన్నీళ్ళు కచ్చితంగా వస్తాయి.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బెంగాలీ సోషల్ డ్రామా మూవీ పేరు ‘అంకో కి కోఠిన్’ (Onko Ki Kothin). 2025లో వచ్చిన ఈ సినిమా, కోవిడ్-19 సమయంలో చదువుకు దూరమైన పేద పిల్లల పరిస్థితుల ఆధారంగా దర్శకుడు సౌరవ్ పలోధి దీనిని తెరకెక్కించారు. ఈ మూవీకి విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా Zee 24 అవార్డ్స్‌లో ‘ఉత్తమ చిత్రం’గా నిలవడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లో కూడా ప్రదర్శించబడింది. ఈ సినిమాలోని సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా లగ్నజిత చక్రవర్తి పాడిన మెలోడీలు, పిల్లల మీద చిత్రీకరించిన రాప్ సాంగ్స్ కథలోని ఎమోషన్‌ను పండించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చి, సమాజంలోని అంతరాలను ప్రశ్నించిన తీరును ప్రశంసించాయి. రిద్దిమాన్ బెనర్జీ, గీతాశ్రీ చక్రవర్తి, తపోమోయ్ దేబ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా, ప్రస్తుతం Hoichoi ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కోల్‌కతాలోని ఒక మురికివాడలో బాబిన్, డాలీ, టైర్ అనే ముగ్గురు పిల్లలు ఉంటారు. వీళ్లది మామూలు స్నేహం కాదు, ప్రాణానికి ప్రాణం ఇచ్చుకునే టైపు. చుట్టూ దరిద్రం తాండవిస్తున్నా, వీళ్ల కలలు మాత్రం ఆకాశాన్ని తాకుతుంటాయి. బాబిన్‌కి డాక్టర్ అవ్వాలని, డాలీకి నర్స్ అవ్వాలని, ఇక టైర్ పెద్ద ఇంజనీర్ అయిపోవాలని కోరిక. పైసా లేకపోయినా, ఆ మురికివాడలోనే వాళ్లదైన ఒక చిన్న లోకాన్ని సృష్టించుకుని బతుకుతుంటారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. బాబిన్ తండ్రికి ఒంట్లో బాలేక సీరియస్ అవుతుంది. ఆ టైమ్‌లో ఒక ఆక్సిజన్ సిలిండర్ కోసం ఆ చిన్న పిల్లలు పడే పాట్లు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.

పెద్దోళ్లు, సిస్టమ్ పట్టించుకోకపోయేసరికి, ఆ ముగ్గురు పిల్లలే ధైర్యం చేసి రంగంలోకి దిగుతారు. తమ దగ్గర ఉన్న చిన్నా చితకా వస్తువులతోనే సొంతంగా ఒక హాస్పిటల్ లాంటిది కట్టి, బాబిన్ తండ్రిని కాపాడుకోవాలని తెగ సాహసం చేస్తారు. ఈ కథ అంతా ఆ పిల్లల అమాయకత్వం, మొండితనం చుట్టూ తిరుగుతుంది. డబ్బు లేకపోతే చచ్చిపోవాలా? అని ఆ పిల్లలు వేసే ప్రశ్నలు గుండెకు తగులుతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కులం, మతం కాకుండా కేవలం మనిషి మనిషికి తోడుండాలనే పాయింట్‌ను ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా చూపిస్తుంది. క్లైమాక్స్ చూశాక ఆ పిల్లల ధైర్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Advertisement

Read Also : వెన్నులో వణుకు పుట్టే తీర్పులు ఇచ్చే డెవిల్ జడ్జి… టాప్ రేటింగ్ తో ఆకట్టుకుంటున్న కే డ్రామా

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×