E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల వరుస హత్యలు… ఆ పార్ట్స్ కోసి చంపే సైకో… బ్రూటల్ మర్డర్ మిస్టరీ

OTT Movie : అమ్మాయిల వరుస హత్యలు… ఆ పార్ట్స్ కోసి చంపే సైకో… బ్రూటల్ మర్డర్ మిస్టరీ

OTT Movie : ఇప్పుడు థ్రిల్లర్ స్టోరీలదే హవా నడుస్తోంది. హాలీవుడ్ నుంచి మొదలు పెడితే, చిన్న ఇండస్ట్రీల దాకా థ్రిల్లర్ కంటెంట్ లోనే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ఎలాగైనా సరే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఒక కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో హీరో ఏ అమ్మాయితో అయితే ఏకాంతంగా గడుపుతాడో ఆ ఆమ్మాయి దారుణంగా చనిపోతుంటుంది. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరో సస్పెన్స్ గా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇంకా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. తొందర్లోనే వచ్చే అవకాశం ఉంది. దీని పేరు ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే

‘రక్తాక్ష’ (Raktaksha) ఒక కన్నడ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. వాసుదేవ SN దీనికి దర్శకత్వం వహించారు. రోహిత్ షణ్ముఖప్ప ఇందులో ప్రధాన పాత్రని పోషించాడు. ఈ సినిమా 2024 జులై 26న రిలీజ్ అయింది. ఇది 1 గంట 58 నిమిషాల రన్‌ టైమ్ తో ఐ యండిబిలో 6.2/10 రేటింగ్ ని పొందింది. Amazon Prime లో ఈ సినిమా తొందర్లోనే అందుబాటులోకి వచ్చే అవాకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

రోహిత్ ఒక సాధారణ యువకుడు, బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటాడు. అతని జీవితంలో ముగ్గురు మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అర్చన, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ రచన, మరో సన్నిహితురాలు రూపా. ఒక్కొక్కరిగా ఈ ముగ్గురూ దారుణంగా హత్యకు గురవుతారు. మొదట అర్చనను హోటల్ రూమ్‌లో చంపేస్తారు, ఆ తర్వాత రచనను ఆమె ఇంట్లో, చివరగా రూపాను కూడా. మూడు మర్డర్లలోనూ క్లూ ఒక్కటే, శవం పక్కన రక్తంతో రాసిన “నీవు తప్పు చేశావ్” అనే మెసేజ్. రోహిత్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్తాడు. తన గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతను ముగ్గురితోనూ శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు. వాళ్లను వాడుకుని వదిలేశాడు. పోలీసులు రోహిత్‌నే మెయిన్ సస్పెక్ట్‌గా చూస్తారు. కానీ అతను నేరం చేయలేదని తెలుస్తుంది.

Read Also : మరో అమ్మాయితో అడ్డంగా బుక్కయ్యే కాబోయే భర్త… ఆమె ఇచ్చే షాక్ కు బుర్రపాడు… లవర్స్ డోంట్ మిస్

ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఒక భయంకరమైన ప్రతీకారం ఉందని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లోతుగా వెళ్తుంది. రోహిత్‌కి ఒక స్నేహితుడు షెట్టి ఉంటాడు. అతను రోహిత్‌ని ఓదార్చడానికి వచ్చినప్పుడు ఒక ఘటనలో రోహిత్ షెట్టిని దారుణంగా చంపేస్తాడు. ఇప్పుడు రోహిత్ నిజంగానే మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. క్లైమాక్స్ ట్విస్ట్ లో ముగ్గురు మహిళలనూ చంపింది ఎవరో బయట పడుతుంది.  క్లైమాక్స్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో అసలు స్టోరీ ఉంటుంది. ఆ గతం ఏంటి ? కిల్లర్ ఎవరు ? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు ?అనే విషయాలను, ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×