E-Paper
Advertisement

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌
Advertisement

Spanish Horror Thriller: లావుగా ఉందనే ఒక్క కారణంతో అందరి ముందు అవమానాలు… రోజూ ఎగతాళి చేస్తూ మెంటల్ టార్చర్… ఇలా తనను ఏడిపించిన అమ్మాయిలే ఓ రోజు ప్రాణాలు పోయే స్థితిలో చిక్కుకుపోతే, సారాకు అది ప్రతీకారం తీర్చుకునే అవకాశంలా కనిపిస్తుంది. వాళ్లను కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి తెలిసినా, అతడిని ఆపేందుకు ఆమె ముందుకొస్తుందా లేదా అన్నది ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా ఉంటుంది. బాడీ షేమింగ్‌ తో మొదలై, ఓ యువతి తీసుకునే నిర్ణయం చుట్టూ భయంకరమైన మలుపులు తిరిగే కథే ‘పిగ్గీ’ (Piggy). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

సారా ఓ టీనేజ్ అమ్మాయి. ఆమె శరీరం లావుగా ఉందనే కారణంతో కొంతమంది అమ్మాయిలు తరచూ ఎగతాళి చేస్తుంటారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆమెను అందరి ముందూ అవమానిస్తారు. ఆమె బట్టలు తీసుకుని దాచి పెట్టి, బికినీలోనే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తారు. ఇలాంటి అవమానాలు సారాకు కొత్తేమీ కాదు. అయినా ప్రతిసారీ మనసులో బాధపడుతూ వాటిని భరిస్తుంటుంది. ఓ రోజు తనను వేధించిన అమ్మాయిల నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్తున్న సారాకు అనుకోని సంఘటన ఎదురవుతుంది.

Advertisement

ఆ అమ్మాయిలను ఓ అపరిచిత వ్యక్తి కిడ్నాప్ చేయడం ఆమె చూస్తుంది. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు ఇలా జరగడం చూసి సారా షాక్ అవుతుంది. అయితే వాళ్లను కాపాడేందుకు వెంటనే ముందుకు వెళ్లదు. తనను అవమానించిన వాళ్లపై ఉన్న కోపం ఒకవైపు, అక్కడ జరుగుతున్నది చూసి కలిగిన భయం మరోవైపు ఆమెను ఆపుతాయి. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై విచారణ మొదలు పెడతారు. సారాకు తెలిసిన విషయాలు చెప్పాలని అడుగుతారు. కానీ ఆమెకు ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది.

తనను వేధించిన అమ్మాయిలను తీసుకెళ్లిన వ్యక్తి తనకు సహాయం చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. అతడి గురించి నిజం చెప్పాలా, మౌనంగా ఉండాలా అనే సందిగ్ధంలో పడుతుంది. తాను ఎదుర్కొన్న అవమానాలు, ఇప్పుడు జరుగుతున్న కిడ్నాప్, తన నిర్ణయం వల్ల వచ్చే పరిణామాలు… ఇవన్నీ సారాను వెంటాడుతుంటాయి. ఆమె నిజం చెబుతుందా ? ఆ అపరిచిత వ్యక్తి వెనుక ఉన్న అసలు విషయం ఏంటి ? చివరికి ఏమవుతుంది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉంది ?

Advertisement

‘పిగ్గీ’ 2022లో విడుదలైన స్పానిష్ హారర్ థ్రిల్లర్. లారా గాలాన్ (Laura Galán), రిచర్డ్ హోమ్స్ (Richard Holmes), కార్మెన్ మాచి (Carmen Machi) ప్రధాన పాత్రల్లో నటించారు. కార్లోటా పెరెడా (Carlota Pereda) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు Jio Hotstarలో కూడా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ డబ్ వెర్షన్ ఉంది. అయితే తెలుగు ఆడియో లేదా సబ్‌టైటిల్స్ మాత్రం లేవు. సైకలాజికల్ హారర్ కథలు ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Tags

Related News

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

Big Stories

Advertisement
×