E-Paper
Advertisement

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

ఇదేనా ప్రజాపాలన..  బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం
Advertisement

Hyderabad: బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఫెస్టివల్ సీజన్‌లో ఛార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని విమర్శించారు. పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి ఆనందాన్ని ఛార్జీల పెంపు దెబ్బతీసిందన్నారు. ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి.

ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్

తెలంగాణ వ్యాప్తం ఉండే సాధారణ సర్వీసులను తగ్గించారని అన్నారు. వాటిని పండగకు స్పెషల్ బస్సులుగా చూపిస్తూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్‌ ఛార్జీలు డబుల్‌ చేశారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులను పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచిందని గుర్తు చేశారు.

పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై ఆగ్రహం

Advertisement

పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారుల వెర్షన్ మరోలా ఉంది. నార్మల్‌గా జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు టికెట్ ధర రూ. 230 ఉండేదన్నారు. పండగ వేళ రూ. 400 వసూలు చేస్తున్నారని రుసరుసలాడారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు ఛార్జీ రూ. 220 ఉండేదని, ఇప్పుడు రూ. 290 వరకు పెంచారని వివరించారు. మీ ప్రజా పాలన? ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Advertisement

ఛార్జీల పెంపు కేవలం పండగ రద్దీ కోసం నడుపుతున్న 7 వేల ప్రత్యేక బస్సులకు వర్తిస్తుందని టీజీఎస్‌ఆర్టీసీ వర్గాల మాట. సాధారణ సర్వీసుల ఛార్జీలు యథాతథంగా ఉన్నాయని, పండగ వేళ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయన్నారు. తిరిగి బస్సులు ఖాళీగా రావడంవల్ల అయ్యే నిర్వహణ ఖర్చులను భర్తీ చేసేందుకు చెబుతున్నారు. అందువల్ల 50 శాతం ఛార్జ్ విధిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. 2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఈ ఛార్జి వసూలు చేస్తున్నామని, ఇదేమీ కొత్త విధానం కాదని అంటున్నారు. పండగ వేళ ఛార్జీల పెంపు సరైంది కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తు్న్నాయి.

Related News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

Big Stories

Advertisement
×