E-Paper
Advertisement

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌
Advertisement

Horror Thriller: కొత్త ఇంట్లోకి మారినప్పుడు కుటుంబమంతా కొత్త ఆశలతో ఉంటుంది. భార్యను కోల్పోయిన జాన్‌ కూడా తన కూతురితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. అందుకోసం కొత్త భార్య మెలనీతో కలిసి ఓ ఇంట్లోకి మారతాడు. కానీ ఆ ఇల్లు వాళ్లు అనుకున్నంత సురక్షితమైనది కాదు. ఇంట్లో వస్తువులు మాయమవడం, వింత శబ్దాలు వినిపించడం, ఎవరో తమను గమనిస్తున్నారనే అనుమానం మొదలవుతాయి. మొదట చిన్న విషయాలుగా కనిపించిన ఈ సంఘటనల వెనుక దాగున్న భయంకరమైన నిజం ఏంటి అనేది తెలియలంటే 2016లో విడుదలైన హారర్‌ థ్రిల్లర్‌ ‘వితిన్‌’ (Within)పై ఒక లుక్కేయాల్సిందే.

కథలోకి వెళ్తే…

భార్యను కోల్పోయిన జాన్‌ అలెగ్జాండర్‌, తన కూతురు హన్నాతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. కొత్త భార్య మెలనీ అలెగ్జాండర్‌ తో కలిసి ప్రశాంతమైన ప్రాంతంలోని ఓ ఇంట్లోకి మారతాడు. చూడటానికి ఆ ఇల్లు ఎంతో అందంగా, కుటుంబంతో కలిసి జీవించడానికి అనువుగా కనిపిస్తుంది. కానీ హన్నాకు మాత్రం అక్కడ ఏదో తేడా ఉందనే అనుమానం మొదలవుతుంది. ఇంట్లోని వస్తువులు కనిపించకుండా పోవడం, ఆహారం మాయమవడం, రాత్రిపూట వింత శబ్దాలు వినిపించడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి.

Advertisement

హన్నా ఈ విషయాలను తండ్రికి చెప్పినా, కొత్త ఇంటికి అలవాటు పడలేక అలా భయపడుతోందని జాన్‌ మొదట భావిస్తాడు. అయితే సంఘటనలు పదేపదే జరగడంతో మెలనీకి కూడా ఆ ఇంటిపై అనుమానం కలుగుతుంది. తమకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతోందని కుటుంబ సభ్యులు గ్రహిస్తారు. ఇదిలా ఉండగా, ఇంటికి సంబంధించిన గత విషయాలు, చుట్టుపక్కల నివసించే వారి ప్రవర్తన హన్నా అనుమానాలను మరింత పెంచుతాయి. తాము నివసిస్తున్న ఇంట్లో ఏదో రహస్యం దాగి ఉందని ఆమెకు అర్థమవుతుంది. అయితే ఆ ఇంట్లో జరుగుతున్న వింత సంఘటనలకు దెయ్యాలే కారణమని అనుకోవాలా ? లేక తమ కళ్లముందే కనిపించకుండా ఎవరో తిరుగుతున్నారా ? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.

కానీ అసలు భయం మరోచోట ఉంటుంది. ఇంటి గోడల మధ్య, ఎవరికీ కనిపించని రహస్య ప్రదేశాల్లో ఓ వ్యక్తి దాక్కుని ఉంటాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా వారి కదలికలను గమనిస్తూ, ఇంట్లోని రహస్య మార్గాలను ఉపయోగించుకుంటూ తన ఉనికిని దాచిపెడతాడు. దీంతో ఈ సంఘటనలు క్రమంగా ప్రమాదకరంగా మారతాయి. తమ ఇంట్లోనే ఓ అపరిచిత వ్యక్తి ఉన్నాడనే నిజం బయటపడటంతో కుటుంబం ప్రాణభయంతో పోరాడాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు ? ఆ ఇంట్లోనే ఎందుకు దాక్కున్నాడు ? అతడి నుంచి జాన్‌, హన్నా, మెలనీ ఎలా బయటపడతారు ? అనే అంశాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘వితిన్‌’ ప్రస్తుతం భారతదేశంలో యాపిల్‌ టీవీ (Apple TV Store), అమెజాన్‌ వీడియో (Amazon Video) ద్వారా అద్దెకు అందుబాటులో ఉంది. ఈ రెండు వేదికల్లోనూ ఇంగ్లీష్‌ ఆడియో ఉంది. తెలుగు డబ్బింగ్‌ మాత్రం అందుబాటులో లేదు. మైఖేల్‌ వర్టన్‌ (Michael Vartan), ఎరిన్‌ మోరియార్టీ (Erin Moriarty), నడైన్‌ వెలాజ్‌క్వెజ్‌ (Nadine Velazquez), రోనీ జీన్‌ బ్లెవిన్స్‌ (Ronnie Gene Blevins) తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫిల్‌ క్లేడన్‌ (Phil Claydon) దర్శకత్వం వహించారు. ఇంట్లోనే ప్రమాదం దాగి ఉండే కథాంశంతో సాగే ఈ చిత్రం హారర్‌, సస్పెన్స్‌ అంశాలను కలిపి చూపిస్తుంది. మానసిక భయాన్ని కలిగించే హారర్‌ థ్రిల్లర్లు ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి ప్రయత్నించవచ్చు.

Read Also: డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

Tags

Related News

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×