E-Paper
Advertisement

పురుగు కరిస్తే పుట్టుకొచ్చే సూపర్ హీరో.. ఈ 8 ఎపిసోడ్ల యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ను చూశారా ?

పురుగు కరిస్తే పుట్టుకొచ్చే సూపర్ హీరో.. ఈ 8 ఎపిసోడ్ల యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ను చూశారా ?
Advertisement

Prime Video Superhero Series : పదమూడు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చి భారతదేశంలో భారీ సంచలనం సృష్టించిన సూపర్ హీరో సిరీస్ ‘Spider-Noir’. ఇది సినిమా కాదు, 1930ల నాటి న్యూయార్క్ నేపథ్యంలో సాగే డార్క్, స్టైలిష్ లైవ్-యాక్షన్ సూపర్ హీరో డ్రామా. మొదటి సీజన్‌ లో 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. నికోలస్ కేజ్ హీరోగా నటించడంతో ఇప్పటికే అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు. మరి ఇంతకీ ఈ సిరీస్ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే..:

కథ 1930ల న్యూయార్క్‌ లో సాగుతుంది. బెన్ రైలీ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కు గడ్డుకాలం నడుస్తుంది. చిన్న చిన్న కేసులు తీసుకుంటాడు. అతని జీవితం సాధారణంగానే ఉంటుంది. కానీ ఒక రోజు పెద్ద గ్యాంగ్‌స్టర్, రహస్యమైన ఒక రాక్షస శక్తి, సీక్రెట్ మహిళ కలిసి పన్నిన ఒక పెద్ద కుట్ర అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ కుట్ర విప్పడంతో బెన్ రైలీ తన గతాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అతను న్యూయార్క్ నగరానికి ఏకైక సూపర్ హీరో అయిన “ది స్పైడర్” అని తెలుస్తుంది.

Advertisement

డార్క్ నాయిర్ స్టైల్ లుక్‌తో, బ్లాక్ కోటు, హ్యాట్, మాస్క్‌తో స్పైడర్ రూపంలో నేరాలు, అక్రమాలతో నిండిన నగరాన్ని కాపాడాల్సి వస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ బెన్ తన చుట్టూ జరుగుతున్న రహస్యమైన హత్యలు, గ్యాంగ్ వార్స్, శక్తివంతమైన శత్రువులను ఎదుర్కొంటాడు. ఒకవైపు తన గతం గురించి తెలుసుకోవడం, మరోవైపు నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత.. ఇలా ఉత్కంఠ, సస్పెన్స్, యాక్షన్ అన్నీ ఒకేసారి కలిసి ఈ సిరీస్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సూపర్ హీరోకి ఇంత డార్క్, రియలిస్టిక్, ఎమోషనల్ టచ్ ఇచ్చిన సిరీస్ లలో ఇదే మొదటిది. మరి చివరికి హీరో ప్రపంచాన్ని ఎలా కాపాడాడు ? ఆ సీక్రెట్ మహిళ ఎవరు ? ఇతన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు ? అన్నది స్టోరీని చూసి తెలుసుకోవాల్సిందే.

రేటింగ్ అదుర్స్

1930ల న్యూయార్క్ వాతావరణాన్ని ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. రెయిన్ పడుతున్న రోడ్లు, పాత భవనాలు, డార్క్ లైటింగ్… నాయిర్ సినిమాల ఫీల్ వస్తుంది. యాక్షన్ సీన్స్ భారీగా ఉంటాయి. స్పైడర్ వెబ్‌లు, ఫైటింగ్ స్టైల్ చూస్తే మంచి థ్రిల్ వస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బెన్ రైలీలోని భావోద్వేగాలు, అతని ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ కూడా బాగా చూపించారు. IMDbలో 8 రేటింగ్ తో ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.

Advertisement

Also Read :వితంతు మహిళతో వింత మనిషి ప్రయాణం… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

ఎవరెవరు ఏ పాత్రల్లో ?

నికోలస్ కేజ్ స్పైడర్/బెన్ రైలీ పాత్రలో తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి అద్భుతంగా నటించాడు. లామోర్న్ మోరిస్, లీ జున్ లీ, కరెన్ రోడ్రిగ్జ్, జాక్ హస్టన్, బ్రెండన్ గ్లీసన్ వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, మిస్టరీ, సస్పెన్స్, డ్రామా అన్నీ ఉన్న ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు అందుబాటులో ఉంది. సూపర్ హీరో జానర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఈ సిరీస్ మిస్ అవ్వకండి.

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×