E-Paper
Advertisement

అవమానించిన వాళ్ల ముందే మిడిల్ క్లాస్ అబ్బాయి అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన బాసిల్ జోసెఫ్ సినిమా

అవమానించిన వాళ్ల ముందే మిడిల్ క్లాస్ అబ్బాయి అరాచకం… ఓటీటీలోకి వచ్చేసిన బాసిల్ జోసెఫ్ సినిమా
Advertisement

Sports Drama Movie on OTT : ఒక ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మలయాళ సినిమా కథ ఒక పల్లెటూరి కుర్రాడు బ్యాడ్మింటన్ ప్లేయర్ కావాలనే కలను నెరవేర్చుకోవడానికి పడే కష్టం చుట్టూ తిరుగుతుంది. కేవలం ఆట మాత్రమే కాకుండా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి కొడుకుల అనుబంధం, ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఉండే బాండింగ్‌ని ఇందులో చాలా చక్కగా చూపించారు. ఎలాంటి హడావిడి, ఫైట్లు లేకుండా.. పల్లెటూరి వాతావరణంలో హాయిగా, సాఫీగా సాగిపోయే ఫీల్ గుడ్ మూవీ ఇది. ఇక ఈ సినిమాలో కామెడీకి కూడా మంచి స్కోప్ ఉంది. బసిల్ జోసెఫ్ మార్క్ కామెడీ టైమింగ్, బాగా పండింది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేలా ఈ సినిమా రూపొందింది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకులు నుండి యావరేజ్ టాక్ లభించింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

ఎక్కడ చూడచ్చు అంటే

2024లో వచ్చిన ఈ మలయాళ స్పోర్ట్స్ డ్రామా సినిమా పేరు ‘కప్’ (Cup). నూతన దర్శకుడు సంజు వి. శామ్యూల్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలో బసిల్ జోసెఫ్, నమితా ప్రమోద్, గురు సోమసుందరం, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించగా, షాన్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నుండి యావరేజ్ స్పందన లభించింది. ముఖ్యంగా మాథ్యూ థామస్ నటన, బసిల్ జోసెఫ్ కామెడీ టైమింగ్, సినిమాటోగ్రఫీ అందరినీ ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ, కథనం పాత స్పోర్ట్స్ సినిమాల తరహాలోనే సాగడం వల్ల ఇది ఒక సాధారణ స్పోర్ట్స్ డ్రామాగా మిగిలిపోయింది. ఈ సినిమా మే 15 నుంచి ManoramaMAX ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

‘కప్’ సినిమా కథ మొత్తం కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన కణ్ణన్ (మాథ్యూ థామస్) అనే 16 ఏళ్ల కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతనికి బ్యాడ్మింటన్ ఆడటం అంటే పిచ్చి, ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున ఆడి గెలవాలనేది అతని లైఫ్ గోల్. అయితే అతను చాలా పేదరికంలో ఉంటాడు. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళంతా వాడు పెద్దగా సాధించేదేం లేదన్నట్టు మాట్లాడుతుంటారు. ఇలాంటి టైమ్‌లో అతని ఏమాత్రం బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే బిన్నీష్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఒక పక్క తన కల కోసం కణ్ణన్ పడే కష్టం, తన ఫ్యామిలీ సపోర్ట్ చూసి, ఆ బిన్నీష్ కూడా మారిపోయి లైఫ్‌లో ఒక దారి వెతుక్కుంటాడు.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర బసిల్ జోసెఫ్. అదే గ్రామంలో నివసించే ఒక సరదా వ్యక్తి అతను. ఒక మంచి గైడ్‌లా కనిపిస్తారు. ఊరిలో బాధ్యత లేకుండా తిరిగే యువకులకు, ముఖ్యంగా కణ్ణన్ బెస్ట్ ఫ్రెండ్ బిన్నీష్‌కు ఇతను ఒక అన్నలాంటి వాడు. తన మార్క్ టైమింగ్‌తో సినిమా అంతటా నవ్వులు పూయించడమే కాకుండా, కణ్ణన్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఎదగడానికి తన వంతు సహాయం చేస్తూ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటాడు. కణ్ణన్ కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ధైర్యం చెప్పే ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్‌గా రనీష్ పాత్రను పోషించాడు.

Advertisement

అయితే కణ్ణన్ జర్నీ అంత ఈజీగా సాగదు. దారిలో బోలెడు ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్డు మీద జరిగిన చిన్న గొడవ వల్ల ఒక రిఫరీ వాడి మీద పగ పడతాడు. ఇంకో పక్క ఒక కోచింగ్ సెంటర్ మేనేజర్ వాడి టాలెంట్‌ని వాడుకుని క్యాష్ చేసుకోవాలని చూస్తాడు. వీటితో పాటు లవర్ అన్నాతో వచ్చే గొడవలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. వీటన్నింటినీ తట్టుకుని, తన కోచ్ సంధ్య (నమితా ప్రమోద్) సాయంతో అతను అనుకున్న బ్యాడ్మింటన్ కప్‌ని ఎలా గెలిచాడు ? అందరి నోళ్లు ఎలా మూయించాడు ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : విదేశీ ప్రయాణం కోసం ఓ ఫ్యామిలీ చేసిన క్రేజీ హంగామా… ఓటీటీలోకి నేరుగా వచ్చేసిన పంజాబీ కామెడీ డ్రామా

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×