E-Paper
Advertisement

Sports Drama OTT: టేబుల్ టెన్నిస్ లో తోపు…ఛాంపియన్ గా మారే గల్లీ కుర్రాడు… రేటింగ్ కూడా టాప్

Sports Drama OTT: టేబుల్ టెన్నిస్ లో తోపు…ఛాంపియన్ గా మారే గల్లీ కుర్రాడు… రేటింగ్ కూడా టాప్
Advertisement

Sports Drama OTT : రియల్ సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా 1950ల కాలంలో ప్రముఖ అమెరికన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మార్టీ రీస్మాన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో మార్టీ మౌసర్ పాత్రలో తిమోతీ చలమెట్ అద్భుతంగా నటించారు. అతను ప్రపంచ ఛాంపియన్‌గా ఎదగడానికి చేసే ప్రయత్నాలను ఈ సినిమా చూపిస్తుంది. ఇది ఇప్పుడు తొమ్మిది విభాగాల్లో ఆస్కార్ బరిలో కూడా ఉంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2025లో వచ్చిన ఈ అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘మార్టీ సుప్రీమ్’ (Marty Supreme). ఈ చిత్రానికి జోష్ సఫ్డీ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో తిమోతీ చలమెట్ నటించగా, గ్వినేత్ పాల్ట్రో, ఒడెస్సా అజియాన్, కెవిన్ ఓ లియరీ, ఫ్రాన్ డ్రెషర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెరికాలో 2025 డిసెంబర్ 25న విడుదలైంది. అయితే భారతదేశంలో 2026 జనవరి 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా అందుకుంది. తిమోతీ చలమెట్ తన నటనకు గానూ గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకున్నారు. ఆస్కార్ లో కూడా ఈ చిత్రం ఉత్తమ చిత్రంతో సహా తొమ్మిది విభాగాల్లో నామినేషన్లు పొందింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1950ల నాటి న్యూయార్క్ నగరంలో మార్టీ అనే ఒక యువకుడు ఉంటాడు. అతనికి టేబుల్ టెన్నిస్ అంటే పిచ్చి, అందులో అద్భుతమైన ప్రతిభ కూడా ఉంటుంది. కానీ అతనిది చాలా పొగరుబోతు స్వభావం. ఎప్పుడూ తనను తాను గొప్పగా ఊహించుకుంటూ ఉంటాడు. అండర్ గ్రౌండ్ క్లబ్బుల్లో చిన్న చిన్న ఆటలు ఆడుతూ గెలిచే మార్టీ, క్రమంగా ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్రపంచంలోకి ఎలా వెళ్లాడు, అక్కడ అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి అనేదే ఈ సినిమా. ముఖ్యంగా ఒక సాధారణ ఆటగాడు ప్రపంచం మెచ్చే స్టార్‌గా ఎదిగే క్రమంలో అతని వ్యక్తిగత జీవితం, గర్వం అతన్ని ఎలా ఇబ్బంది పెట్టాయో ఇందులో చూడవచ్చు.

మార్టీ కేవలం ఆటలోనే కాదు, తన స్టైల్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంటాడు. అయితే అతని అతి తెలివి వల్ల కొన్నిసార్లు నష్టపోతుంటాడు. ఆ సమయంలో అతనికి ఒక రిచ్ మహిళ (గ్వినేత్ పాల్ట్రో) పరిచయం అవుతుంది. ఆమె అతనికి అండగా నిలబడి, ఒక చాంపియన్‌గా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆట మీద ఉన్న ప్రాణం, గెలవాలనే తపన, మధ్యలో వచ్చే గొడవలు.. వీటన్నిటినీ దాటుకుని మార్టీ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేది దర్శకుడు చాలా ఆసక్తికరంగా చూపించాడు.

Advertisement

Read Also : సాయం చేయబోయి చిక్కుల్లో పడే డిటెక్టివ్… గుండెలు జారిపోయే ట్విస్ట్ ఇచ్చే అమ్మాయి

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×