E-Paper
Advertisement

Suspense thriller OTT : సాయం చేయబోయి చిక్కుల్లో పడే డిటెక్టివ్… గుండెలు జారిపోయే ట్విస్ట్ ఇచ్చే అమ్మాయి

Suspense thriller OTT : సాయం చేయబోయి చిక్కుల్లో పడే డిటెక్టివ్… గుండెలు జారిపోయే ట్విస్ట్ ఇచ్చే అమ్మాయి
Advertisement

Suspense thriller OTT : ఓటీటీలో నియో-నోయిర్’ శైలిలో ఒక మూవీ స్ట్రీమింగ్ లో ఉంది. సుమారు 1 గంట 29 నిముషాల రన్‌టైమ్ తో ఉత్కంఠ కలిగించే మలుపులు ఎక్కువగా ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాను కేవలం 8 రోజుల తక్కువ సమయంలో తీసినా, దీని మేకింగ్, విజువల్స్ చాలా నాణ్యంగా ఉన్నాయని విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి కూడా. ఈ కథ పీటర్ మోస్లీ అనే ఒక మాజీ పోలీస్ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన ఒక మహిళ వల్ల ఊహించని కుట్రల్లో చిక్కుకుంటాడు. క్లైమాక్స్ వరకు సినిమా కుర్చీలో కట్టిపడేస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ నియో నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘టాక్సిక్ ఇంపల్సెస్’ (Toxic Impulses). ఈ చిత్రానికి కైల్ షాడ్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో సెబాస్టియన్, ఒలివియా బకిల్, హెలెన్ ఉడీ ప్రధాన పాత్రలు పోషించారు. 2022 డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమాకు IMDb లో 7.6/10 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Apple TV ప్లాట్‌ ఫామ్ లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పీటర్ మోస్లీ అనే ఒక రిటైర్డ్ పోలీస్ డిటెక్టివ్ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకరోజు జెమిరా అనే ఒక అందమైన మహిళ అతన్ని కలిసి, తనను ఎవరో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి సహాయం కోరుతుంది. మొదట పీటర్ దీనికి ఒప్పుకోకపోయినా, ఆమె పరిస్థితి చూసి జాలిపడి కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లేకొద్దీ, అతను ఒక ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడని అర్థమవుతుంది.

నిజానికి జెమిరా ఒక బ్యాంక్ దోపిడీదారుల ముఠాలో సభ్యురాలు. ఆమెను ఒక సైకోలాంటి వ్యక్తి తన కంట్రోల్‌లో ఉంచుకుని ఆడించుకుంటూ ఉంటాడు. జెమిరా చెప్పిన మాటలు నమ్మి రంగంలోకి దిగిన పీటర్, తెలియకుండానే ఒక పెద్ద బ్యాంక్ రాబరీ ప్లాన్‌లో భాగమైపోతాడు. చివరికి అబద్ధాలు, వెన్నుపోట్లు మధ్య పీటర్ ఆ మహిళను రక్షించాడా ? ఆ కుట్ర నుంచి తను ఎలా బయటపడ్డాడు ? అనే విషయాలను ఈ సినిమాను తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : విదేశీ మహిళ కోసం పడరాని పాట్లు… మెంటలెక్కించే ట్విస్టులున్న డిటెక్టివ్ థ్రిల్లర్

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×