Bandi Sanjay: బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానని గత పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తానని ప్రకటించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1203 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.120 కోట్ల 30 లక్షల రూపాయలు ఇవ్వాలని, కానీ ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని, ఆ నిధులు ఎప్పడిస్తారని బండి ప్రశ్నించారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడ మండంలోని విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. ఆదివారం ఆయా గ్రామ పంచాయతీలకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీలను గ్రామ సర్పంచులకు అందజేశారు. ఈ సందర్భంగా విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేస్తున్నా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను పట్టించుకోనన్నారు. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ ను మించిపోయారని విమర్శించారు. కేసీఆర్ సైతం ఆనాడు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీకి రూ.5 నుంచి రూ.10 లక్షలదాకా ప్రోత్సాహక నగదు అందిస్తామని హామీ ఇస్తే.. దాదాపు 2 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమయ్యాయని గుర్తుచేశారు. కానీ చిల్లిగవ్వ ఇవ్వలదేన్నారు.
Also Read: Allu Sirish wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్… వైరల్ అవుతున్న వీడియో !
ఈ రెండు పార్టీలు దొందూ దొందేనని, ప్రోత్సాహక నిధులు ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి చిల్లిగవ్వ ఇవ్వడంలేదని, మాజీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులివ్వాలని తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం అదే బాటలో నడుస్తోందని ఫైరయ్యారు. బీజేపీ పోరాటాలకు, మాజీ సర్పంచుల ఆందోళనలకు తలొగ్గి వాయిదాల పద్దతిలో పైసలిచ్చేందుకు ముందుకొచ్చిందని బండి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశలవారీగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులతో అంతో ఇంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అలాంటిది వీళ్లు గ్రామ స్వరాజ్యం, గాంధీ ఆశయాల గురించి మాట్లాడేదేంటని ఫైరయ్యారు.
Also Read: Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్.. కార్తీక దీపం 2 పరిస్థితి దారుణం..?