E-Paper
Advertisement

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ థ్రిల్ల‌ర్‌… గే కపుల్స్ కొడుకు స్పై ఏజెంట్ గా

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ థ్రిల్ల‌ర్‌… గే కపుల్స్  కొడుకు స్పై ఏజెంట్ గా
Advertisement

Spy Action Comedy Thriller : థియేటర్లలో సందడి చేసిన ఒక బాలీవుడ్ మూవీ, రెండు నెలల తరువాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ నిర్మించాడు. కామెడీ స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ ను బాగానే నవ్వించింది. దాదాపు పదేళ్ల తర్వాత నటుడు ఇమ్రాన్ ఖాన్ ఈ సినిమా ద్వారా వెండితెరపైకి తిరిగి రావడం విశేషం. అమీర్ ఖాన్ కూడా ఇందులో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతానికి ఇది హిందీలో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో వచ్చేందుకు మరికొంత సమయం పట్టచ్చు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కామెడీ స్పై థ్రిల్లర్ పేరు ‘హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్’ (Happy Patel: Khatarnak Jasoos). ఇది అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఇందులో వీర్ దాస్, మిథిలా పాల్కర్, మోనా సింగ్, షరీబ్ హష్మీ, ఇమ్రాన్ ఖాన్ తదితరులు నటించారు. దీనికి వీర్ దాస్, కవి శాస్త్రి డైరెక్టర్లుగా పనిచేశారు. ఈ మూవీ 2026 జనవరి 16 థియేటర్లలో రిలీజైంది. థియేటర్లో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హ్యాపీ పటేల్ అనే ఒక కుర్రాడు లండన్ లోని రిటైర్డ్ బ్రిటిష్ స్పైల దగ్గర పెరుగుతాడు. అయితే ఆ ఏజెంట్లు ఇద్దరూ గే లు. హ్యాపీ పటేల్ ను చిన్నప్పుడే దత్తత తీసుకుని ఉంటారు. వాళ్ల మధ్య పెరగడం వల్ల తను కూడా స్పై ఏజెంట్ కావాలని అనుకుంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే పటేల్ పరమ అమాయకుడు, కొంచెం గందరగోళం మనిషి. అయితే ఒకరోజు తను భారత సంతతికి చెందిన వాడిని అని తెలుసుకుంటాడు. దీంతో పటేల్ ఒక పెద్ద మిషన్ మీద గోవాకి వెళ్తాడు. అక్కడ ఒక సైంటిస్ట్‌ని మామా అనే విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. వాళ్ళ నుండి తనని కాపాడాలి. మనోడికి ఇక్కడి పద్ధతులు అస్సలు తెలియవు, పైగా అతను చేసే ప్రతి పనిలో ఏదో ఒక కామెడీ తప్పు జరుగుతూనే ఉంటుంది. ఆ గందరగోళంలోనే శత్రువులకి చుక్కలు చూపిస్తూ ఆ సైంటిస్ట్‌ని ఎలా కాపాడాడనేది అసలు కథ. ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే, కథ మధ్యలో పదేళ్ల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తాడు. అమీర్ ఖాన్ కూడా ఒక చిన్న రోల్‌లో మెరుస్తాడు. యాక్షన్ కంటే ఎక్కువ కామెడీ మీద నడిచే ఈ సినిమాలో, హ్యాపీ పటేల్ అమాయకపు చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. మొత్తం మీద ఒక పిచ్చి స్పై మిషన్ ఎలా సక్సెస్ అయిందనేది ఫుల్ ఎంటర్టైనింగ్‌గా చూపించారు.

Read Also : నలుగురి మధ్య నలిగిన ప్రేమ… ఒకరి భార్యపై మరొకరి కన్ను… ఒంటరిగా చూడాల్సిన సినిమా

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×