E-Paper
Advertisement

వియన్నా హైజాక్ వెనుక ఉన్న అసలైన విలన్ ఎవరు?… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సినిమా

వియన్నా హైజాక్ వెనుక ఉన్న అసలైన విలన్ ఎవరు?…  ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సినిమా
Advertisement

Spy Thriller Movie on OTT : ఒక పక్కా మైండ్ గేమ్ స్పై థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది. జేమ్స్ బాండ్ సినిమాల్లాగా తుపాకులతో కాల్చుకోవడం, కార్లు ఎగరేయడం లాంటివి ఇందులో ఉండవు. అయితే కూర్చున్న చోటే ఒకరినొకరు మాటలతో నరుక్కుంటారు. ఒక విమానం హైజాక్ ఉదంతంలో ఈ స్టోరీ ఉంటుంది. సినిమా అంతా సీరియస్‌గా సాగుతూ, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది. గూఢచారి లోకంలో ప్రేమ కంటే డ్యూటీయే ముఖ్యం అని చెప్పే ఒక క్లాస్ థ్రిల్లర్ ఇది. మీరు యాక్షన్ కంటే ఎక్కువగా మైండ్ గేమ్స్, పాతకాలపు గూఢచారి కథలను ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది.

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ అమెరికన్ స్పై థ్రిల్లర్ సినిమా పేరు ‘ఆల్ ది ఓల్డ్ నైవ్స్’ (All the Old Knives). జానస్ మెట్జ్ దీనికి దర్శకత్వం వహించారు. చిత్రం ప్రముఖ రచయిత ఓలెన్ స్టెయిన్‌హౌర్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది, ఆయనే స్వయంగా దీనికి స్క్రీన్‌ప్లే కూడా రాశారు. ఇందులో క్రిస్ పైన్, తండివే న్యూటన్, జోనాథన్ ప్రైస్, లారెన్స్ ఫిష్‌బర్న్ లీడ్ రోల్స్ లో నటించారు. నడులో సాధారణ స్పై సినిమాల్లాగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్‌లు ఉండవు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మైండ్ గేమ్స్ ద్వారా కథ ముందుకు సాగుతుంది. సినిమాలోని ఎక్కువ భాగం ఒకే రెస్టారెంట్‌లో జరుగుతున్నట్లు అనిపించినా, లండన్ వంటి ప్రదేశాల్లోని ఫ్లాష్‌బ్యాక్ దృశ్యాలు ప్రేక్షకులకు ఒక క్లాసిక్ గూఢచారి కథను చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా క్రిస్ పైన్, తండివే న్యూటన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇది ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Prime Video) లో అందుబాటులో

కథలోకి వెళ్తే

Advertisement

2012లో వియన్నాలో ఒక విమానం హైజాక్ అవుతుంది. ఆ సమయంలో ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను రక్షించడంలో సీఐఏ (CIA) విఫలమవుతుంది. అయితే సీఐఏలోని ఎవరో ఒకరు ఉగ్రవాదులకు లోపల ఏం జరుగుతుందో సమాచారం ఇచ్చారని, ఆ ద్రోహం వల్లే వందల మంది చనిపోయారని ఎనిమిదేళ్ల తర్వాత అనుమానం వస్తుంది. ఆ ద్రోహి ఎవరో కనిపెట్టే బాధ్యతను ఏజెంట్ హెన్రీ పెల్హామ్ (క్రిస్ పైన్)కు అప్పగిస్తారు అధికారులు.హెన్రీ తన విచారణలో భాగంగా తన పాత ప్రేమికురాలు, మాజీ సహోద్యోగి అయిన సెలియా (తండివే న్యూటన్)ను కలవడానికి కాలిఫోర్నియా వెళ్తాడు. అప్పటికే సెలియా ఏజెంట్ వృత్తిని వదిలేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉంటుంది.

ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తూ ఇద్దరూ పాత విషయాలను మాట్లాడుకుంటారు. హెన్రీ తన మాటలతో సెలియాను ఇరికించి, ఆ రోజు హైజాక్ సమయంలో ఆమె చేసిన పనుల గురించి ఆరా తీస్తాడు. ఆ డిన్నర్ టేబుల్ సంభాషణే సినిమాకు మెయిన్ హైలైట్. సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్ అసలు ఊహించని విధంగా ఉంటుంది. ఆ రోజు ద్రోహం చేసింది సెలియా అని హెన్రీ నమ్ముతాడు, కానీ అసలు నిజం వేరేలా ఉంటుంది. సెలియాను రక్షించడం కోసం హెన్రీనే ఆ రోజు సమాచారాన్ని లీక్ చేశాడని బయటపడుతుంది. చివరకు హెన్రీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా సరే, ప్రేమ కోసం అతను చేసిన ఆ తప్పు అతన్ని ఎలాంటి ముగింపుకు తీసుకెళ్లిందనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తప్పిపోయిన సోదరి… యూట్యూబర్ తీసిన అద్భుతమైన హారర్ మిస్టరీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×