Brahmamudi serial today Episode: ఒకవైపు రాజు కోసం లక్కీ, మరోవైపు చలపతి, లక్ష్మీ కంగారు పడుతుంటారు. ఫోన్ కూడా కలవడం లేదని ఆలోచిస్తుంటారు. చలపతి మరింత బాధపడుతుంటాడు. శృతి వచ్చి వాడు దుగ్గిరాల వారసుడు ఆ విషయం బయటకు తెలిస్తే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినప్పటి నుంచి భయంగా ఉందని చెప్తుంటే.. లక్ష్మీ వాడికేం కాదండి మీరేం భయపడకండి అంటూ ఓదారుస్తుంది.
గార్డెన్‌లో కూర్చున్న సుభాష్ వాటర్ బాటిల్ తీసుకోబోయి కిందపడబోతుంటే.. రాజు వచ్చి కాపాడతాడు. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన అపర్ణ వాళ్లిద్దరిని చూసి ఎమోషనల్ అవుతుంది. గుణంలో కూడా ఇతను అచ్చం నా కొడుకులాగే ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే రాజు కూడా వీళ్ళ దగ్గర కొంచెం ప్రేమగా ఉన్నట్టు నటించాలి లేదంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేసేలా ఉన్నారు అని మనసులో అనుకుని తాతయ్య లోపలికి వెళ్తారా..? రండి నేను తీసుకెళ్తాను అంటాడు. దీంతో సుభాస్ వద్దులే బాబు నేను అపర్ణను పిలుస్తాను. తను తీసుకెళ్తుంది నన్ను అనగానే.. రాజు అదేంటి తాతయ్య అలా అంటారు. ఇప్పుడు నేను కూడా మీ మనవణ్నే కదా..? మీరు ధైర్యంగా నాకు అన్ని పనులు చెప్పొచ్చు.. ఏంటి తాతయ్య ఇంకా ఆలోచిస్తారు అంటూ సుభాష్‌ను లోపలికి తీసుకెళ్తాడు.
అంతా గమనిస్తున్న అపర్ణ దగ్గరకు ఇందు వచ్చి ఏమైంది నాన్నమ్మ అని అడగ్గానే.. ఆ అబ్బాయిని చూడగానే.. నా మనసుకు ఎందుకో తను మనకు చాలా పరిచయం అయిన వ్యక్తిలా అనిపిస్తుంది అనగానే.. ఇందు అలాంటిదేం లేదు నాన్నమ్మ.. వాళ్లకు మనకు ఎక్కడ రిలేషన్ లేదు.. అనగానే.. అయితే ఆ అబ్బాయి వాళ్ల ఇల్లు ఎక్కడో చెప్పు నేను వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లతో మాట్లాడతాను.. అంటూ ఇందును కన్వీన్స్ అడిగి రాజు వాళ్ల అడ్రస్ తెలుసుకుంటాను అంటుంది. దీంతో ఇందు అడ్రస్ ఇస్తుంది.
సుభాష్‌ను రూంలోకి తీసుకెళ్లిన రాజు తాతయ్య మీరు ఉండేది ఈ రూంలోనే అని అడుగుతాడు. సుభాష్ అవును బాబు అని చెప్పగానే.. ఏంటి తాతయ్య ఇందు రూం కూడా ఇలాగే ఉంది. మీరేమో రిచ్ మీ రూములేమో స్టోర్ రూముల్లా ఉన్నాయి అసలు ఎక్కడ పొంతన లేదు తాతయ్య.. అసలు మీరు నిజంగా ఈ ఇంటికి సంబంధించిన వారేనా నాకు కొంచెం డౌటుగా ఉంది అని అడగ్గానే.. అప్పుడప్పుడు మాకు అలాంటి డౌట్స్ వస్తుంటాయి బాబు.. అంటూ ప్లాష్‌బ్యాక్ మొత్తం రాజుకు చెప్తాడు సుభాష్.. దీంతో రాజు వామ్మో నేనేదో మచ్చిక చేసుకోవాలని ఫీల్ కోసం అడిగితే ఈ ముసలోడు మొత్తం తరతరాల చరిత్ర చెప్తున్నారు.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ యాక్సిడెంట్ గురించి సుభాష్ చెప్పబోతుంటే రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రూంలో హ్యాపీగా ఉన్న భ్రమరాంబ దగ్గరకు వెళ్లిన శేషు ఏంటి విషయం అంత హ్యాపీగా ఉన్నావు అంటూ అడగ్గానే.. రేఖ ప్లాన్ ను తాను చెడగొట్టినందుకు ఆనందంగా ఉందని చెప్తుంది. త్వరలోనే మదన్, స్వాతిలకు పెళ్లి కూడా చేయోచ్చు అంటూ సంబరపడుతుంటే.. అప్పుడే రూంలోకి రేఖ వస్తుంది. రేఖను చూసి షాక్ అవుతుంది భ్రమరాంబ. ఎందుకు వచ్చావు రేఖ అని అడగ్గానే.. ఆ రాజు గాడిని ఇందును ఒకే రూంలో ఉండేలా చేయాలని అందుకే వెళ్దాం పద అంటూ భ్రమరాంబను తీసుకుని ఇందు రూంలోకి వెళ్లి రాజును కన్వీన్స్ చేసి ఇందును భ్రమరాంబ రూంలోకి శేషును రాజు రూంలోకి షిప్ట్ చేస్తారు.
మరుసటి రోజు అపర్ణ రాజు వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ చలపతి, లక్ష్మీలను కలుస్తుంది. అపర్ణ తన పేరు చెప్పగానే.. చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. అపర్ణ తాను రాజును చూశానని తను అచ్చం నా కొడుకు స్వరాజ్ లాగే ఉన్నాడు.. ఒకప్పుడు మేమంతా శ్రీశైలం వెళ్తుంటే.. యాక్సిడెంట్ లో అందరూ చనిపోయారు కానీ నా కూతురు కొడుకు అక్కడ కనిపించలేదు అంటూ ఎమోషనల్ అవుతుంటే.. లక్ష్మీ, చలపతి షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.