E-Paper
Advertisement

Spy Thriller OTT : 2 గంటల 21 నిమిషాల ఉత్కంఠ… ‘ధురందర్’ ను మరిపించే స్పై థ్రిల్లర్… ఆస్కార్ ను గెలిచిన సినిమా

Spy Thriller OTT : 2 గంటల 21 నిమిషాల ఉత్కంఠ… ‘ధురందర్’ ను మరిపించే స్పై థ్రిల్లర్… ఆస్కార్ ను గెలిచిన సినిమా
Advertisement

Spy Thriller OTT : అబ్బురపరిచే ఒక స్పై థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలో టాప్ రేటింగ్ తో నడుస్తోంది. ఈ సినిమా ఇటీవల వచ్చిన ‘దురంధర్’ ఈ సినిమా మరిపిస్తుంది కూడా. ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఆస్కార్ ను కూడా గెలుచుకుంది. ఒక గూఢచారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. స్పై థ్రిల్లర్‌ల ఫ్యాన్స్ అయితే, దీన్ని తప్పకుండా చూడాల్సిందే.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ స్పై థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’ (Bridge of Spies). ఈ చిత్రానికి స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో టామ్ హాంక్స్ (జేమ్స్ డోనోవన్), మార్క్ రైలాన్స్ (రుడాల్ఫ్ అబెల్) నటించారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 1400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 330 కోట్లు. అయితే పెట్టుబడికి నాలుగు రెట్లు ఎక్కువగానే వసూలు చేసింది బాక్సాఫీస్ వద్ద. ఈ సినిమా 2016లో ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అనే ఆరు ఆస్కార్ విభాగాలలో నామినేట్ అయింది. అయితే ఈ చిత్రం ఉత్తమ సహాయ నటుడి కేటగిరిలో (మార్క్ రైలాన్స్) అవార్డును గెలుచుకుంది. ఇది IMDbలో 7.6 రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1962 నాటి కాలంలో అమెరికా, రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా యుద్ధం జరుగుతుండేది. ఆ టైంలో అమెరికాలో ఒక రష్యా గూఢచారి దొరికిపోతాడు. అందరూ అతన్ని ఉరి తీయాలని గోల చేస్తుంటే, హీరో జేమ్స్ డోనోవన్ అనే లాయర్ మాత్రం అతడికి మరణశిక్ష పడకుండా జైలు శిక్ష పడేలా చేస్తాడు. దీనివల్ల జనం అతన్ని తిట్టుకున్నా తను మాత్రం తగ్గడు. కట్ చేస్తే.. ఆ తరువాత రష్యాలో ఒక అమెరికా పైలట్ విమానంతో సహా దొరికిపోతాడు. ఇప్పుడు అమెరికాకి తమ పైలట్ కావాలి, రష్యాకి వాళ్ళ గూఢచారి కావాలి.

ఇక ఈ ఇద్దరినీ మార్చుకోవడానికి మధ్యవర్తిగా హీరో డోనోవన్‌ను పంపిస్తారు. అప్పట్లో బెర్లిన్ గోడ కడుతున్న టైం కాబట్టి అక్కడి పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. పైగా రష్యన్లు, జర్మన్లు ఒకేసారి ఇద్దరు అమెరికన్లను బందీలుగా పట్టుకుంటారు. దీంతో ఒక్కడిని ఇచ్చి ఇద్దరిని తీసుకురావాలని హీరో ప్లాన్ చేస్తాడు. ప్రభుత్వం మాత్రం పైలట్ వస్తే చాలు అంటుంది.  కానీ హీరో మాత్రం మొండిగా పంతం పట్టి, తన తెలివితేటలతో అటు రష్యన్లను, ఇటు జర్మన్లను ఒప్పించి.. ముగ్గురినీ క్షేమంగా తమ దేశాలకు వెళ్ళేలా చేసి రియల్ హీరో అనిపించుకుంటాడు.

Advertisement

Read Also :  అనంత సముద్రంలో అదిరిపోయే సాహసం… 16 ఏళ్ల అమ్మాయి ఏడు నెలలు ఒంటరిగా…

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×