E-Paper
Advertisement

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా ? పరగడుపున ఈ 5 జ్యూస్‌లు తాగండి !

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా ? పరగడుపున ఈ 5 జ్యూస్‌లు తాగండి !
Advertisement

Weight Loss: బరువు తగ్గడం అనేది కేవలం కఠినమైన వ్యాయామం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మనం తీసుకునే ఆహారంపై 70% ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున తీసుకునే పానీయాలు మన జీవక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పండ్ల రసాల కంటే కూరగాయల రసాలు బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో చక్కెర తక్కువగా, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు పరగడుపున తాగాల్సిన 5 ఉత్తమ వెజిటబుల్ జ్యూస్‌ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో పెరిగిన బరువును తగ్గించుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలా మంది టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తారు. కానీ దానికి బదులుగా తాజా కూరగాయల రసాలను పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది కేవలం బరువు తగ్గడానికే కాకుండా.. చర్మ సౌందర్యానికి , రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయ పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచే అద్భుతమైన 5 జ్యూస్‌లు ఇవే..

Advertisement

బరువు తగ్గడానికి 5 ఉత్తమ కూరగాయల జ్యూస్:
1. బూడిద గుమ్మడికాయ రసం:
బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో.. కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినది బూడిద గుమ్మడికాయ రసం. ఇందులో 96% నీరు ఉంటుంది .క్యాలరీలు చాలా తక్కువ. పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు క్లీన్ అవుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరానికి చలవను ఇస్తుంది. ఒక చిన్న ముక్క గుమ్మడి కాయను మిక్సీ పట్టి, వడకట్టి, అందులో కొంచెం నిమ్మరసం, నల్ల మిరియాల పొడి కలిపి తాగితే.. ఫలితం అద్భుతంగా ఉంటుంది.

2. సొరకాయ రసం:
సొరకాయలో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఉదయాన్నే.. ఒక గ్లాసు సొరకాయ రసం తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి, బి, పొటాషియం అందుతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా.. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. అయితే.. సొరకాయ చేదుగా ఉంటే మాత్రం అస్సలు వాడకూడదని గుర్తుంచుకోండి.

Advertisement

3. క్యారెట్ , బీట్‌రూట్ రసం:
దీనిని ‘ABC’ జ్యూస్ (Apple, Beetroot, Carrot)అని కూడా అంటారు. కానీ బరువు తగ్గాలనుకునే వారు కేవలం క్యారెట్, బీట్‌రూట్ , కొంచెం అల్లం కలిపి తీసుకోవడం ఉత్తమం. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్లు వ్యాయామం చేసేటప్పుడు మన స్టామినాను పెంచుతాయి.

Also Read : వణుకుతున్న చేతులు, తిమ్మిర్లు పట్టే వేళ్లు.. మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా ?

4. దోసకాయ, పుదీనా రసం:
దోసకాయలో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఈ రెండింటి కలయికతో చేసే జ్యూస్ తాగడం వల్ల బొడ్డు దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరగడానికి సహాయ పడుతుంది. ఈ జ్యూస్ తాగిన తర్వాత చాలా సేపటి వరకు ఆకలి వేయదు. దీని వల్ల మనం ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటాము.

5. పాలకూర, సెలెరీ రసం:
ఆకుకూరల రసాలు పోషకాల గనులు. పాలకూరలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. సెలెరీ బరువు తగ్గడానికి ప్రపంచ వ్యాప్తంగా.. ప్రసిద్ధి చెందిన కూరగాయ. ఈ గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయ పడుతుంది. రుచి కోసం ఇందులో.. కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×