E-Paper
Advertisement

Stop Motion Movies OTT : ‘కోరలైన్’ నుండి ‘చికెన్ రన్’ వరకు… బెస్ట్ యానిమేషన్ మూవీస్… ఒక్కసారి చూస్తే వదలరు భయ్యా

Stop Motion Movies OTT : ‘కోరలైన్’ నుండి ‘చికెన్ రన్’ వరకు… బెస్ట్ యానిమేషన్ మూవీస్… ఒక్కసారి చూస్తే వదలరు భయ్యా
Advertisement

Stop Motion Movies OTT : స్టాప్-మోషన్ యానిమేషన్ సినిమాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఫ్రేమ్ చేతితో రూపొందించినవే. పాత్రలు, సెట్‌లు, లైటింగ్ అన్నీ చాలా ఓర్పుతో సెట్ చేస్తుంటారు. అందుకే స్టాప్-మోషన్ సినిమాలు వినోదాన్ని అందించడమే కాకుండా, దాని వెనుక ఉన్న కళా శక్తిని కూడా ప్రదర్శిస్తాయి. ఇక ఓటీటీలో దొరికే టాప్ 5 స్టాప్-మోషన్ మూవీస్ ఇవే. ఫ్యామిలీతో కలిసి ఏంచెక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు.

1. చికెన్ రన్ (Chicken Run) – 2000

2000లో వచ్చిన ఈ సినిమా, ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన స్టాప్-మోషన్ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఒక ఫార్మ్‌లో బందీ అయిన కోళ్లు తప్పించుకునే కథ ఇది. దీనికి కొనసాగింపుగా ‘చికెన్ రన్: డాన్ ఆఫ్ ది నగెట్’ 2023లో వచ్చింది. Netflixలో ఈ యానిమేషన్ మూవీస్ ను చూస్తే పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు.

2. కోరలైన్ (Coraline) – 2009

Advertisement

డార్క్ ఫాంటసీలో మాస్టర్‌పీస్ ఈ యానిమేటెడ్. ఒక చిన్న కోరలైన్ అనే అమ్మాయి కొత్త ఇంట్లో, ఒక వింత డోర్ ద్వారా మరో ప్రపంచంలోకి వెళ్తుంది. అక్కడ ఆమకు మరో కొత్త అమ్మ-నాన్నలు వస్తారు. వాళ్ళ కళ్ళు బటన్ తో కుట్టబడి ఉంటాయి. మొదట్లో ఆ ప్రపంచం చాలా బాగున్నట్లు అనిపించినా, అక్కడి తల్లి కోరలైన్ కళ్లకు కూడా బటన్లు కుట్టాలని చూస్తుంది. ఆ ప్రమాదం నుండి కోరలైన్ ఎలా తప్పించుకుంది, తన నిజమైన తల్లిదండ్రుల వద్దకు ఎలా చేరింది? అనేదే ఈ సినిమా కథ. ఇది Netflixలో స్ట్రీమింగ్ అవుతోందో.

3. ఫ్రాంకెన్‌వీనీ (Frankenweenie) – 2012

‘ఫ్రాంకెన్‌వీనీ’ 2012లో వచ్చిన అమెరికన్ స్టాప్-మోషన్ యానిమేటెడ్ కామెడీ చిత్రం. దీనికి టిమ్ బర్టన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విక్టర్ ఫ్రాంకెన్‌స్టైయిన్ అనే బాలుడి చుట్టూ తిరుగుతుంది. అతను తన చనిపోయిన కుక్క స్పార్కీని బతికించుకోవడానికి విద్యుత్ శక్తిని ఉపయోగిస్తాడు. కానీ అతని సహచరులు అతను ఏమి చేసాడో కనిపెట్టి, వాళ్ళ చనిపోయిన పెంపుడు జంతువులకు కూడా జీవం పోస్తారు. ఫలితంగా అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఇది jio Hotstarలో దొరుకుతుంది.

4. పరానార్మన్ (ParaNorman) – 2012

Advertisement

ఇందులో ఒక చిన్న బాయ్ కి పరానార్మల్ పవర్స్ ఉంటాయి. అతను ఆత్మలతో కూడా మాట్లాడగలడు. గ్రామంలో పాత శాపం నుంచి అందరినీ కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఉంటుంది. ఇది Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

5. ది బాక్స్‌ట్రోల్స్ (The Boxtrolls) – 2014

ఇది ఒక అమెరికన్ 3D స్టాప్-మోషన్ యానిమేటెడ్ ఫాంటసీ కామెడీ చిత్రం. ఇది అల్లాన్ స్నో రాసిన “హియర్ బి మాన్స్టర్స్” అనే నవల ఆధారంగా రూపొందింది. ఒక ఊరి భూగర్భంలో నివసించే ‘బాక్స్‌ట్రోల్స్’ అనే వింత జీవులు ఉంటాయి. అవి చెత్తను సేకరించి రకరకాల వస్తువులను తయారు చేస్తూ జీవిస్తుంటాయి. ‘ఎగ్స్’ (Eggs) అనే ఒక బాలుడిని ఈ జీవులు పెంచుతాయి. ఆ ఊరి విలన్ అయిన ఆర్చిబాల్డ్ స్నాచర్, ఈ బాక్స్‌ట్రోల్స్‌ను అంతం చేసి సమాజంలో గొప్ప హోదా పొందాలని కుట్ర పన్నుతాడు. ఎగ్స్ తన బాక్స్‌ట్రోల్ కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకుని, వాళ్ళను ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ. ఇది Netflix, Prime Videoలో దొరుకుతుంది.

Read Also ;  ‘ది రాజా సాబ్’ నుంచి ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ వరకు… హాట్ స్టార్ లో ఫిబ్రవరిలో రానున్న కొత్త సినిమాలు ఇవే

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×