E-Paper
Advertisement

Stranger Things Season 5 OTT : అప్ సైడ్ డౌన్ లో ఒళ్లు గగుర్పొడిచే ఆ పేగుల సెట్, మైండ్ ప్లేయర్ ను ఎలా క్రియేట్ చేశారో తెలుసా ?

Stranger Things Season 5 OTT : అప్ సైడ్ డౌన్ లో ఒళ్లు గగుర్పొడిచే ఆ పేగుల సెట్, మైండ్ ప్లేయర్ ను ఎలా క్రియేట్ చేశారో తెలుసా ?
Advertisement

Stranger Things Season 5 OTT : ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ సిరీస్ ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. కానీ అది మనకు ఇచ్చిన అద్భుతమైన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ షోకు సంబంధించిన చివరి ఎపిసోడ్ ఈ ఏడాది జనవరి 1న విడుదలైంది. దానితోనే ఈ తొమ్మిదేళ్ల ‘స్ట్రేంజర్ థింగ్స్’ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికాము. ఇందులో ఉన్న ఎపిక్ కథ, పాత్రలు, VFX ఆడియన్స్ ను క్రేజీగా ఫీల్ అయ్యేలా చేశాయి. ఏకంగా నెట్ ఫ్లిక్స్ క్రాష్ అయ్యే స్థాయిలో ప్రేక్షకుల స్పందన వచ్చింది. అప్‌సైడ్ డౌన్ ప్రపంచాన్ని సృష్టించిన విధానానికి ఫిదా అయిపోయారు. అయితే షో క్రియేటర్స్ డఫర్ బ్రదర్స్ దీనికి వీఎఫ్ఎక్స్ బాగా దోహద పడిందని వెల్లడించారు. తాజాగా షో ప్రొడక్షన్ డిజైనర్ సెట్‌ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

సెట్లను ఎలా క్రియేట్ చేశారంటే?

‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things)లో మొదటి సీజన్ నుండి విజువల్స్ మెయిన్ హైలెట్ గా నిలిచాయి. డెమోగార్గాన్ దాడి సన్నివేశాలు, అప్‌సైడ్ డౌన్, చివరి సీజన్‌లో హాకిన్స్ లొకేషన్‌, అబిస్‌ క్రియేషన్ వంటివి సృష్టించడం సవాలు కూడుకున్న కష్టమైన పని. ఇటీవల ప్రొడక్షన్ డిజైనర్ క్రిస్ ట్రుజిల్లో ఈ సిరీస్ లోని పూర్తి సెట్ టూర్ నిర్వహించి, వాటి గురించి మనకు తెలియని ఎన్నో వివరాలను వెల్లడించారు.

Advertisement

ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ యూట్యూబ్ ఛానెల్‌లోని ఒక వీడియోలో, క్రిస్ సిరీస్ లోని ఐకానిక్ సెట్ల లోపలి భాగాన్ని చూపించారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా మైండ్ ఫ్లేయర్ బాడీ లోపల వెక్నా పిల్లలందరినీ ఉంచిన స్థలం గురించి వివరించారు. ఇంత కష్టమైన సెట్‌ ను రూపొందించడం ఇదే మొదటిసారి అని క్రిస్ అన్నారు. “ఇవన్నీ చెట్ల కొమ్మల వంటివి. దీన్ని సృష్టించడానికి దాదాపు అన్ని జీవుల అంతర్గత శరీరాలు, శరీర నిర్మాణ శాస్త్రంపై పరిశోధన చేసాము” అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : మనిషిని ముక్కలుముక్కలుగా కట్ చేసి… ‘దృశ్యం’ను మించిన ట్విస్టులున్న క్రైమ్ డ్రామా

మైండ్ ఫ్లేయర్ శరీరం ఇలా…

Advertisement

సినిమాలో విలన్ అయిన మైండ్ ఫ్లేయర్ శరీరం లోపల పిల్లలను ఉంచుతాడు. ఆ పొరలను ఎలా రూపొందించారో కూడా క్రిస్ ఈ వీడియోలో వివరించాడు. లెవెన్ తో పాటు మిగతా వాళ్ళు ఆ పొరను చించి, పిల్లల్ని బయటకు తీస్తారు. ఆ టైమ్ లో అది నిజమైన చర్మంలా కనిపించేలా సిలికాన్‌ తో తయారు చేశామని క్రిస్ వివరించాడు. ఈ సన్నివేశాల కోసం, డిజైనర్లు పిల్లల పరిమాణం, ఆకారంలో ఉన్న డమ్మీలను వాడారట. అప్‌సైడ్ డౌన్‌లో మైళ్ల పొడవునా ఉన్న తీగలను సృష్టించడం, స్పెషల్ ఎఫెక్ట్స్, లైటింగ్ వంటి విషయాలను సైతం ఆయన వెల్లడించారు. కాగా ‘స్ట్రేంజర్ థింగ్స్’కు సంబంధించిన మొత్తం 5 సీజన్లు నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×