E-Paper
Advertisement

Top 5 School Vans: ఫోర్స్ ట్రావెలర్ TO టాటా మ్యాజిక్ ఎక్స్ ప్రెస్.. దేశంలోని టాప్ 5 స్కూల్ వ్యాన్లు ఇవే!

Top 5 School Vans:  ఫోర్స్ ట్రావెలర్ TO టాటా మ్యాజిక్ ఎక్స్ ప్రెస్..  దేశంలోని టాప్ 5 స్కూల్ వ్యాన్లు ఇవే!
Advertisement

Top 5 School Vans 2025:  స్కూల్ పిల్లల రవాణా కోసం ఉపయోగించే వ్యాన్లు సేఫ్టీతో పాటు పలు ఫీచర్లను కలిగి ఉండాలి. దేశంలో 2025లో టాప్ 5 స్కూల్ వ్యాన్లు సేఫ్టీ, కంఫర్ట్, మైలేజ్, సీటింగ్ కెపాసిటీ, సరసమైన ధరలపై ఆధారపడి ఉంటాయి. చిన్న స్కూల్స్ నుంచి పెద్ద ఇన్‌స్టిట్యూషన్ల వరకు ఈ మోడల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంతకీ ఇండియాలోని టాప్ స్కూట్ వ్యాన్లు ఏవంటే..

భారత్ లో టాప్ 5 స్కూల్ వ్యాన్లు  

 

⦿ Force Traveller School Van

Advertisement

ఈ వ్యాన్ లో  13, 26 సీటర్ వేరియంట్లు ఉంటాయి. దీని ధర రూ. 14-22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మైలేజ్ 15-16 kmpl (డీజల్) ఇస్తుంది. అత్యధిక సీటింగ్, సేఫ్టీ ఫీచర్లు (ABS, FDSS), ప్రీమియం కంఫర్ట్. పెద్ద స్కూల్స్‌ కు ఉపయోకరంగా ఉంటుంది కాబట్టి, టాప్ ప్లేస్ దక్కించుకుంది.

⦿ Tata Winger School Van

ఈ స్కూల్ వ్యాన్ కూడా 13, 21 సీటర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 13-16 లక్షలు ఉంటుంది. మైలేజ్ 10-12 kmpl ఇస్తుంది. టాటా కంపెనీ నమ్మకం, విశ్వసనీయత, స్మూత్ రైడ్, సేఫ్టీ కారణంగా స్కూల్ ట్రాన్స్‌ పోర్ట్‌ లో ఫస్ట్ చాయిస్ గా మారింది.

⦿ Mahindra Supro School Van

Advertisement

ఈ స్కూల్ వ్యాన్ లో 8, 10 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. దీని ధర రూ. 6-8 లక్షలు ఉంటుంది. మైలేజ్ 23 kmpl (డీజల్) ఉంటుంది. EV వేరియంట్ 100-120 km రేంజ్ ను అందిస్తుంది.  బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎక్కువ మైలేజ్, చిన్న స్కూల్స్, సిటీ రూట్స్‌ కు బాగా సూటవుతుంది.

Read Also: మారుతి సుజుకి To టాటా.. దేశీ మార్కెట్లో బెస్ట్ ట్యాక్సీ కార్లు ఇవే!

⦿ Tata Magic Express School Van

ఈ స్కూల్ వ్యాన్ 7, 10 సీటర్ వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ. 7-9 లక్షలు ఉంటుంది. మైలేజ్ 20 kmpl ఇస్తుంది.   సరసమైన ధర, సేఫ్టీ ఫీచర్లు, రూరల్, సెమీ అర్బన్ రూట్స్‌ కు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.

⦿ Maruti Suzuki Eeco School Van

ఈ స్కూల్ వ్యాన్ లో సీటింగ్ 5, 7 సీటర్ వేరియంట్లు ఉంటాయి. దీని ధర రూ. 5-6 లక్షలు ఉంటుంది. మైలేజ్ 16-27 kmpl/kg (పెట్రోల్/CNG) ఇస్తుంది. అతి సరసమైన, ఈజీ మెయింటెనెన్స్, చిన్న గ్రూప్స్‌ కు పాపులర్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఈ ఏడాది అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ 5 బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

పెద్ద స్కూల్స్‌ కు Force Traveller, Tata Winger బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఆప్షన్‌కు Eeco, Supro పాపులర్. సేఫ్టీ రూల్స్ (AIS-063 స్టాండర్డ్స్) చెక్ చేసి కొనడం మంచిది. ధరలు ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ స్టేట్ ప్రకారం మారుతాయి. కొనే ముందు లేటెస్ట్ డీటెయిల్స్ కోసం డీలర్‌ ను కాంటాక్ట్ కావడం మంచిది. ఈ 5 వ్యాన్లు 2025లో స్కూల్ ట్రాన్స్‌ పోర్ట్‌ లో టాప్ లో నిలిచాయి.

Read Also:  సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×