E-Paper
Advertisement

OTT Movie : గ్యాంగ్ వార్ తో దద్దరిల్లిపోతున్న ఢిల్లీ స్టోరీ… ఆ సీన్స్ అంతకు మించి… పక్కా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : గ్యాంగ్ వార్ తో దద్దరిల్లిపోతున్న ఢిల్లీ స్టోరీ… ఆ సీన్స్ అంతకు మించి… పక్కా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో పిచ్చెక్కించే సిరీస్ లు వస్తున్నాయి. ఇక వేరే ఆలోచన లేకుండా ఆడియన్స్ కూడా వీటికే కనెక్ట్ అవుతున్నారు.
భారత దేశ విభజన తర్వాత ఢిల్లీ అండర్‌వరల్డ్‌లో అధికారం కోసం పోరాటాలతో ఈ సిరీస్ కేక పెట్టిస్తుంది. మాఫియాతో పాటు, లవ్ స్టోరీలు కూడా ఇందులో హైలెట్ గా ఉంటాయి. మధ్యలో వచ్చే రొమాంటిక్ సీన్స్ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. 1960 ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ని ఒక్క సారి చూస్తే వదిలిపెట్టరు దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2023లో వచ్చిన ఈ పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’.1960 ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ 9 ఎపిసోడ్ల సిరీస్‌ను మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించగా, సుపర్న్ ఎస్. వర్మ కథ-స్క్రీన్‌ప్లే అందించారు. అర్నబ్ రే రాసిన “Sultan of Delhi: Ascension” నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ 2023 అక్టోబర్ 13 నుంచి జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. ఇందులో తాహిర్ రాజ్ భసీన్, అంజుమ్ శర్మ, అనుప్రియా గోయెంక, మౌనీ రాయ్ లీడ్ రోల్స్ లో నటించారు.

Advertisement

Read Also : అది ఇళ్ళు కాదు మాయల దిబ్బ… రాత్రికి రమ్మని రాద్దాంతం… శవం పక్కనే చెడుగుడు

స్టోరీ ఏమిటంటే

భారత దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ఢిల్లీకి వచ్చిన యువకుడు అర్జున్ భాటియా. శరణార్థిగా జీవిస్తూ ఆయుధాల స్మగ్లర్ జగన్ సేథ్ గ్యాంగ్‌లో చేరతాడు. తన ధైర్యం, తెలివితో క్రమంగా జగన్ దగ్గరి మనిషిగా మారి, 1962 చైనా యుద్ధం సమయంలో భారత ఆర్మీకి రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసే భారీ డీల్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తాడు. జగన్ సేథ్ కి కుడి భుజంగా ఎదుగుతాడు. జగన్ కూడా నువ్వు సక్సెస్ అయితే నా తర్వాత నీవే సుల్తాన్ అని హామీ కూడా ఇస్తాడు. అయితే అర్జున్‌కి రెండు లవ్ స్టోరీలు కథని మలుపు తిప్పిటయి. సాధారణ అమ్మాయి సంజన, డాన్సర్ నయనతార అతని జీవితాన్ని గందరగోళంలో పడేస్తాయి.

Advertisement

ఆయుధాలు డీల్ సక్సెస్ అయిన తర్వాతే నిజమైన ద్రోహాలు బయటపడతాయి. జగన్ సేథ్ అర్జున్‌ని చంపి డబ్బు అంతా దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. అర్జున్‌ని ఇప్పుడు జగన్ గ్యాంగ్ ట్రాప్ చేసేందుకు కుట్రలు చేస్తుంది. క్లైమాక్స్‌లో అర్జున్ జగన్ సేథ్‌ని షూట్ చేసి చంపేస్తాడు. నయనతార కూడా అర్జున్ కోసం గ్యాంగ్ తో ఫైట్ చేస్తుంది. కానీ తర్వాత అర్జున్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. సంజన అర్జున్‌ని కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోతుంది. ఇక అర్జున్ ఒంటరిగా మిగిలి, రక్తంతో తడిసిన చేతులతో ఢిల్లీ అండర్‌వరల్డ్‌కి “సుల్తాన్” అవుతాడు. అయితే చివరికి అతని వద్ద ఏ ఒక్క ప్రేమించే వ్యక్తి కూడా మిగలడు.

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×