టెక్నాలజీ చాలా కాలంగా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ కే పరిమితం కాగా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా దుస్తుల్లోకి కూడా టెక్నాలజీ అడుగు పెట్టింది. ఓ జపనీస్ క్రియేటర్ ఏకంగా టెక్నాలజీతో కూడిన బ్రాను తయారు చేశారు. సాధారణ హుక్ మాదిరిగా ఓపెన్ కాకుండా, ఫింగర్ ప్రింట్ తో మాత్రమే ఓపెన్ అయ్యేలా రూపొందించారు. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ బ్రాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని చూసి క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.
‘ZAWAWORKS’ పేరుతో ఓ యువతి క్రేజీ వస్తువులను తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే వేలి ముద్రతో ఓపెన్ అయ్యే బ్రాన్ రూపొందించారు. దీనిని జులై 19, 2024న ఆవిష్కరించారు. దీనిని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ టైప్ చేయడం, క్లాప్ కొట్టడం లాంటివి కాకుండా ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అయ్యేలా దీనిని రూపొందించారు. ఈ బ్రా ను అన్ లాక్ చేయడానికి భాగస్వామి వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. దీనిని యాంటీ చీటింగ్ బ్రాగా సంపోదిస్తున్నారు. సదరు క్రియేటర్ ఈ బ్రాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ మాత్రమే మీ బ్రాను తెరవగలడు” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ అసాధారణ ఆలోచన నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అయ్యారు.
ఒక వినియోగదారుడు “ఇది పురుషుల కోసమా?” అని ప్రశ్నించగా, క్రియేటర్ సరదాగా.. “మీ స్నేహితురాలికి లేదంటే భార్యకు బహుమతిగా ఇవ్వండి” అని కామెంట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లోనే బాగా వైరల్ అయ్యింది. చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ఈ విచిత్రమైన ఆవిష్కరణను చూసి నవ్వారు. “మహిళల్లో అలాంటి భావనలు పెరిగిపోతే, దుస్తుల్లో ఇలాంటి భద్రతా ఫీచర్లు తప్పకుండా వస్తాయి” అంటూ ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశాడు. “ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ అయ్యే బ్రా మాదిరిగానే.. రూమ్‌మేట్ స్నాక్స్ దొంగిలించకుండా నిరోధించే జిమ్ బ్యాగ్ ను కూడా తయారు చేస్తే బాగుంటుంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “బయోమెట్రిక్ ప్రామాణీకరణ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సాంకేతికత రోజువారీ వస్తువులలోకి విస్తరించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
స్మార్ట్ బ్రా ఇంకా కమర్షియల్ గా అందుబాటులోకి రాలేదు. కానీ, ఈ ఆలోచన ఇప్పటికే మన దైనందిన జీవితాలను ఎంత తెలివిగా మార్చగలవు చర్చకు దారి తీసింది. ఫోన్లను చాలా కాలంగా వ్యక్తిగత సాంకేతికతకు పీక్ గా పరిగణిస్తున్నప్పటికీ, ఇలాంటి ఆవిష్కరణలు లో దుస్తులకు కూడా పాకుతాయని ఊహించలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!