E-Paper
Advertisement

OTT Movie : అది ఇళ్ళు కాదు మాయల దిబ్బ… రాత్రికి రమ్మని రాద్దాంతం… శవం పక్కనే చెడుగుడు

OTT Movie : అది ఇళ్ళు కాదు మాయల దిబ్బ… రాత్రికి రమ్మని రాద్దాంతం… శవం పక్కనే చెడుగుడు
Advertisement

OTT Movie : సూపర్‌ న్యాచురల్ హారర్ జనర్ లో వచ్చిన ఒక హిందీ మూవీ ఆడియన్స్ ని తెగ భయపెడుతోంది. ఇది ఒక ఫ్యామిలీ రిచ్యువల్స్ లో చిక్కుకునే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఒక ఆమ్మాయి ట్రాప్ లో పడ్డ యువకుడు ఎదుర్కునే భయంకరమైన సన్నివేశాలతో ఈ స్టోరీ ఉత్కంఠంగా ఉంటుంది. ఇందులో మైండ్ డిస్టర్బ్ సీన్స్ చాలానే ఉన్నాయి. రాత్రి చుస్తే పగలు కలలోకి వచ్చే స్టోరీ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2020లో విడుదలైన ఈ హిందీ హారర్ మూవీ పేరు ‘క్రియ’ (Kriya). సిద్ధార్థ్ శ్రీనివాసన్ డైరెక్షన్ లో ఇది రూపొందింది. నోబుల్ లూక్ (నీల్), నవ్జోత్ రంధావా (సితారా), అవంతికా అకర్కర్ (తారా దేవి) లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో, Shudder లో అందుబాటులో ఉంది. 1 గంట 35 నిమిషాల ఈ సినిమా ఐయండిబిలో 5 /10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నీల్ అనే వ్యక్తి ఒక రాత్రి క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నప్పుడు, సితార అనే ఒక అందమైన అమ్మాయి పరిచయమవుతుంది. వారి మధ్య మాటలు కలిసిన తర్వాత, సితార తన తండ్రికి ఒంట్లో బాగోలేదని, వెంటనే ఇంటికి రావాలని కోరుతుంది. నీల్ ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. సితార ఇంటికి చేరుకున్న నీల్‌కు అక్కడ ఆశ్చర్యకరమైన వాతావరణం ఎదురవుతుంది. ఇంట్లో సితార తండ్రి మంచాన పడి, ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అతని చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఏదో ఒక వింతైన, పురాతనమైన మరణ కర్మలను ఆచరిస్తూ ఉంటారు.

Read Also : హనీ ట్రాప్ తో హీటెక్కించే రివేంజ్… అందంతో మంచం మీదే నరకం… ఈ ఆట వేరే లెవెల్

ఈ కర్మకాండలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. ఆ కుటుంబ వింత ప్రవర్తనకు నీల్‌ కంగారు పడతాడు. పితృస్వామ్య ఆచారం ప్రకారం, కుటుంబ పెద్ద అంత్యక్రియలను కొడుకు మాత్రమే నిర్వహించాలి. కానీ ఆ కుటుంబంలో మగ సంతానం ఉండదు. దీంతో ఆ కుటుంబం నీల్‌ను బలవంతంగా ఆ కర్మలలో పాల్గొనేలా చేస్తుంది. ఆ రాత్రి జరిగే రిచ్యువల్స్, కుటుంబ రహస్యాలు, అతీత శక్తుల ప్రభావంతో నీల్ జీవితం ఒక పీడకలలా మారుతుంది. ఆ ఇంటి నుండి పారిపోవాలని ఎంత ప్రయత్నించినా కుదరదు. ఆ కుటుంబం ఒక పురాతన శాపంతో బాధపడుతోందని, ఇప్పుడు ఆ కర్మలలో పాల్గొనడం ద్వారా నీల్ కూడా ఆ శాపంలో భాగమయ్యాడని అతనికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇక మిగతా కథలో నీల్ ఆ శాపం నుండి బయటపడతాడా ? ఆ ఇంట్లో చిక్కుకుపోతాడా ? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

 

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×