E-Paper
Advertisement

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి కీలక సూచన.. వాట్సాప్, మీ సేవలో మళ్లీ దరఖాస్తులు!

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి కీలక సూచన.. వాట్సాప్, మీ సేవలో మళ్లీ దరఖాస్తులు!
Advertisement

Ponguleti Srinivas: స్వేచ్ఛ బ్యూరో: ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో పాల‌కుల‌కు ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉండేదికాద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. మంత్రుల కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారుకాద‌ని అన్నారు. బుధ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొని ప్ర‌జ‌ల నుంచి విన‌తి ప‌త్రాల‌ను స్వీక‌రించారు. కొన్ని స‌మ‌స్య‌ల‌పై అక్క‌డిక‌క్క‌డే క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి మాట్లాడుతూ..

Advertisement

అనంత‌రం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి  మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్ర‌తివారం క్యాబినెట్‌లో ఒక మంత్రి ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తు వీలైనంత‌వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌న్నారు. ముఖాముఖిలో చాలా వ‌ర‌కు ఇండ్ల గురించి ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నారు.పేద‌వారి ఆత్మ‌గౌర‌వానికి చిహ్న‌మైన ఇందిర‌మ్మ ఇండ్ల కార్య‌క్ర‌మం ఈ ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. ఈ ప్ర‌భుత్వంలోనే త‌మ సొంతింటి క‌ల నెర‌వేతుంద‌నే ఆశతో ప్ర‌జ‌లు ఉన్నారన్నారు. వారి ఆశ‌ల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం మొద‌టి విడ‌త‌లో 4.50 ల‌క్ష‌లు, రెండో విడ‌త‌లో 2.50 ల‌క్ష‌లు మొత్తం 7 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేసింద‌న్నారు.

పుట్టి పెరిగిన చోటే నివాసం..

Advertisement

గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో ఆనాటి ప్ర‌భుత్వం పేద‌ల‌కు అర‌కొర‌గా న‌గ‌రానికి 30-40 కిలోమీట‌ర్ల దూరంలో ఇండ్లు నిర్మించింద‌ని ఫ‌లితంగా త‌మ జీవ‌నోపాధి దెబ్బ‌తింటుంద‌న్న ఆందోళ‌న‌తో పేద‌లు ఆ ఇళ్ల‌ల్లో అడుగుకూడా పెట్ట‌లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పేద‌వాడు పుట్టి పెరిగిన చోటే నివాసం క‌ల్పించాల‌న్న ఆలోచ‌న‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు నిర్మించ‌బోయే ఇండ్ల విలువ 40 నుంచి కోటి రూపాయిల వ‌ర‌కు ఉంటుంద‌ని ఇంటిస్ద‌లంలో వాటా కూడా క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్..

పైల‌ట్ ప్రాజెక్ట్‌గా 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందిరమ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు ఈ ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్‌, వెబ్‌సైట్ ద్వారా మ‌రో సారి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. భూముల‌కు సంబంధించిన వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో ప‌రిష్కరించ‌గ‌ల‌గిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామ‌న్నారు. ఇక దేశంలో యువ‌త‌ను దెబ్బ‌తీసిన నీట్ ప‌రీక్ష లీకేజీపై శాంతియుతంగా ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్న యువ‌త‌పైన‌, మ‌ద్ద‌తు తెలిపిన కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు మ‌ల్లిఖార్జ‌న్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల‌పై లాఠీఛార్జి చేయ‌డం కేంద్ర ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి పొంగులేటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..

ప్ర‌తిప‌క్షాల‌కు స‌మాధానం చెప్ప‌లేక పార్ల‌మెంటును ప‌లుమార్లు వాయిదా వేయ‌డం, స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ప్ర‌భుత్వ చేత‌కానిత‌నాన్ని ఎత్తిచూపుతుంద‌న్నారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌ధాని మోదీ, మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎఐసిసి పిలుపు మేర‌కు ఈరోజు హైద‌రాబాద్‌లో ర్యాలీ నిర్వ‌హించామ‌ని, నీట్ ప‌రీక్ష రాసిన 22 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్దుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందన్నారు.

Also Read:  ఖాకీవనంలో కామతురాణం.. ఉదయ్‌ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు?

Related News

Karimnagar Robbery: కరీంనగర్ దోపిడీ ముఠా ప్లాన్ అట్టర్ ఫ్లాప్?.. చివరిలో సినిమా రేంజ్ లాంటి ట్విస్ట్..!

BJP Attack: రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్.. ‘దేశ సమగ్రతను దెబ్బతీస్తే తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే!’

Engineering Student: నా అవయవాలను దానం చేయండి అంటూ.. బీటెక్ విద్యార్ధి సూసైడ్ కలకలం!

KTR: ఆదిలాబాద్ CCI పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ!

Jurala Project: జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద.. త్వరలో గేట్లు ఎత్తే అవకాశం!

Kiran Kumar Reddy: నీట్ స్కామ్‌పై కేంద్రానికి కాంగ్రెస్ డెడ్‌లైన్.. భువనగిరి ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో విద్యార్థులపై దాష్టీకమేంటి? కేంద్రాన్ని నిలదీసిన కవిత

Big Stories

Advertisement
×