E-Paper
Advertisement

Suriya films on OTT : ‘కరుప్పు’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారా ? అంతకంటే ముందు ఓటీటీలో చూడాల్సిన సూర్య బెస్ట్ మూవీస్ ఇవే

Suriya films on OTT : ‘కరుప్పు’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారా ? అంతకంటే ముందు ఓటీటీలో చూడాల్సిన సూర్య బెస్ట్ మూవీస్ ఇవే
Advertisement

Suriya films on OTT :  ఈ సంవత్సరం సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న సందర్భంలో అంతకంటే ముందు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కనీసం ఒక్కసారైనా చూడవలసిన సూర్య సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

గజిని (2005)

సూర్య, అసిన్, నయనతార నటించిన ఈ సినిమా ఒక సంచలనం. దర్శకుడు AR మురుగదాస్ తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్  సన్‌ఎన్‌ఎక్స్‌టిలో అందుబాటులో ఉంది. సూర్య కెరీర్ ప్రారంభంలో వచ్చిన అత్యంత వినోదాత్మక చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఈ చిత్రం ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త సంజయ్ రామస్వామి చుట్టూ తిరుగుతుంది. అతను తన ప్రియురాలిని కాపాడటానికి ప్రయత్నిస్తూ తలకు గాయం కావడంతో ప్రతి 15 నిమిషలకి జ్ఞాపక శక్తి కోల్పోతాడు. సంజయ్ ఆమె మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి గజనీలా ప్రయత్నిస్తాడు.

అయాన్ (2009)

Advertisement

సూర్య, ప్రభు, తమన్నా భాటియా నటించిన ఈ సినిమాని, దర్శకుడు కె.వి. ఆనంద్ దర్శకత్వంలో వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సన్‌ఎన్‌ఎక్స్‌టిలో ఉంది. దివంగత కె.వి. ఆనంద్ రూపొందించిన ఈ గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌లో మరోసారి హారిస్ జయరాజ్ అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌ను అందించారు. కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన దేవా తన తండ్రి స్నేహితుడు దాస్‌కు సహాయం చేయడానికి స్మగ్లింగ్‌లో పాల్గొనే కథతో ‘అయాన్’ సినిమా ఉంటుంది.

 సింగం (2010)

సూర్య, అనుష్క శెట్టి , ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమా హరి దర్శకత్వంలో రూపొందింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సన్‌ఎన్‌ఎక్స్‌టిలో అందుబాటులో ఉంది. మాస్ సీన్స్ తో పాటు, పంచ్ డైలాగ్‌లతో నిండిన యాక్షన్-ప్యాక్డ్ చిత్రం కోసం చూస్తున్నట్లయితే, ‘సింగం’ బెస్ట్ సజేషన్. సూర్య 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో ఆయన పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ దురై సింగం అనే నిజాయితీపరుడైన పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. ఇందులో చెన్నైకి చెందిన గ్యాంగ్‌స్టర్ మయిల్ వాగనంతో సింగంకి శత్రుత్వం పెరుగుతుంది. ఆ గ్యాంగ్‌స్టర్ ఆరాచకాలకు ఎలా అడ్డుకట్ట వేశాడానేదే ఈ కథ.

సూరరై పోట్రు (2020)

Advertisement

సూర్య, అపర్ణ బాలమురళి నటించిన ఈ సినిమా సుధ కొంగర డైరెక్షన్ లో తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది. ఈ చిత్రం భారత వైమానిక దళ మాజీ అధికారి అయిన నేదుమారన్ రాజంగం (మారా) కథను చూపిస్తుంది. అతను సామాన్యులకు సరసమైన విమాన ప్రయాణాన్ని అందించే విమానయాన సంస్థను సృష్టించాలని కలలు కంటాడు. అతను ఆర్థిక అడ్డంకులను ఎలా అధిగమించాడనేది ఈ కథ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

జై భీమ్ (2021)

సూర్య , లిజోమోల్ జోస్, మణికందన్, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్ నటించిన ఈ లీగల్ డ్రామా సినిమాకి టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ కథ1993లో కడలూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. జై భీమ్, గిరిజనుల అణచివేతను వెలుగులోకి తెచ్చే ఒక శక్తివంతమైన కథ. ఈ చిత్రం న్యాయవాది కె. చంద్రు చుట్టూ తిరుగుతుంది. అతను సెంగెని అనే గర్భిణీ గిరిజన మహిళ తన భర్త రాజకన్ను కోసం వెతుకుతున్న కేసును తీసుకుంటాడు. రాజకన్నుపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేసిన తర్వాత, అతను కనిపించకుండా పోతాడు. పోలీసులు మాత్రం అతను తప్పించుకున్నాడని ఆరోపిస్తారు. ఈ అన్యాయాన్ని బయటపెట్టే క్రమంలో స్టోరీ ఉంటుంది.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×