E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు, స్పాట్‌లో ఎనిమిది మంది

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు, స్పాట్‌లో ఎనిమిది మంది
Advertisement

Road Accident:  దేశంలో జాతీయ రహదారులు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. వాహనదారులు అతి వేగంగా వెళ్తూ వాహనాలపై నియంత్రణ కోల్పోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా అలాంటి ఘటన యూపీలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

యూపీలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

అతివేగం ప్రమాదకరం.. నిత్యం మనం వింటున్నమాట. కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్పీడ్ లిమిట్ దాటితే వాహనాలు ప్రమాదాలకు గురవుతారని జాతీయ రహదారులపై బోర్డులు కనిపిస్తాయి. వాటిని వాహనదారులు చూసిన పాపాన పోలేదు. ఫలితంగా దారుణమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం ఘోరం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న పికప్ ట్రక్ అదుపు తప్పింది. దాని వెనకాల ఆర్టీసీ బస్సు వస్తోంది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు డ్రైవర్‌.. కుడివైపునున్న డివైడర్‌ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

Advertisement

ట్రక్కు నుంచి గాల్లోకి ఎగిరిపడ్డ ప్రయాణికులు, స్పాట్‌లో ఎనిమిది మంది

ట్రక్కు డివైడర్‌ని ఢీ కొన్న సమయంలో అందులోని ప్రయాణికులు గాలిలోకి ఎగిరి రోడ్డుపై కిందపడ్డారు. దీనికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. 25 ఏళ్ల డ్రైవర్ మురారి, మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వెనుక డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే UPIDA బృందం అక్కడికి చేరుకుంది. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స కోసం అంబులెన్స్‌లో బంగార్‌మౌలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: గంజాయి ‘బంగ్’ కలకలం.. హోలీ పూట మత్తు చిమ్ముతున్న ముఠా అరెస్ట్

ఓ క్రేన్ సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించింది. ట్రక్కులో చిక్కుకున్న డ్రైవర్‌ మృతదేహాన్ని సిబ్బంది బయటకు తీశారు. అక్కడి నుంచి ట్రక్కును పక్కకు తొలగించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు ఔరాస్ ప్రాంతానికి చెందినవారు. హోలీ జరుపుకోవడానికి ఉన్నావ్‌కు వెళ్తున్నారు.

బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు ప్రయాణించిన వాహనం ప్రమాదానికి గురైందని సమాచారం వచ్చిందన్నాడు. ఆసుపత్రిలో కొడుకు మృతదేహాన్ని చూసి షాకైనట్టు చెప్పాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు కుటుంబానికి ఏకైక జీవనాధారమని రోడ్డు ప్రమాదంలో అతడ్ని కోల్పోయామని కన్నీరు మున్నీరు అయ్యాడు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×