E-Paper
Advertisement

Survival Thrillers on OTT : ఓటీటీలో చావును దగ్గరగా చూపించే సర్వైవల్ థ్రిల్లర్స్… హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళు చూడచూడకూడని సినిమాలు

Survival Thrillers on OTT : ఓటీటీలో చావును దగ్గరగా చూపించే సర్వైవల్ థ్రిల్లర్స్… హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళు చూడచూడకూడని సినిమాలు
Advertisement

Survival Thrillers on OTT : ఓటీటీలో ఎన్నో థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్ లో ఉన్నాయి. అయితే చావును దగ్గరగా చూపించే సర్వైవల్ థ్రిల్లర్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. ఇవి దెయ్యాల సినిమాల కన్నా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం అటువంటి సినిమాల గురించే చెప్పుకుంటున్నాం. అయితే హార్ట్ వీక్‌గా ఉన్న వాళ్లు ఈ సినిమాలను అవాయిడ్ చేయడం మంచిది. ఈ సినిమాలు చాలా ఇంటెన్స్ గా సాగుతూ ఊపిరి కూడా పీల్చుకోనివ్వవు. మరి ఈ సినిమాల పేర్లు, ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాల్లోకి వెళ్తే…

Buried (2010)

ఇందులో రయాన్ రేనాల్డ్స్ హీరోగా నటించారు. హీరో ఇరాక్‌లో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఒకరోజు కిడ్నాప్ అయి, ఒక చిన్న శవపేటిక లో బంధీ అయిపోతాడు. అంతే ఫుల్ మూవీ అక్కడే జరుగుతుంది. ఆక్సిజన్ స్లోగా తగ్గుతుంది, లైటర్, సెల్ ఫోన్ మాత్రమే ఉంటాయి. ఫోన్ చేసి సహాయం అడగాలి, కానీ బ్యాటరీ అయిపోతుంది. ఇది చూస్తుంటే మనకే ఊపిరి ఆడకుండా అనిపిస్తుంది. Prime Videoలో ఈ సినిమాను చూడొచ్చు.

127 Hours (2010)

Advertisement

జేమ్స్ ఫ్రాంకో ఒక అడ్వెంచర్ లవర్‌. ఒంటరిగా ఎత్తైన కొండలో హైకింగ్ చేస్తాడు. అయితే అనుకోకుండా ఒక రాయి కింద చిక్కుకుపోతాడు. అక్కడ అతని చేయి ఇరుక్కుపోతుంది. 127 గంటలు అంటే సుమారు 5 రోజులు అక్కడే ఉండాల్సివస్తుంది. నీళ్లు కూడా తక్కువ, ఫుడ్ అస్సలు ఉండదు. ఎవరూ సహాయం కూడా చేయడానికి రారు. చివరికి అతను తన చేతిని కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సీన్ చూస్తుంటే గుండె ఆగిపోతుంది. ఇది రియల్ స్టోరీ కూడా. Prime Video, Jio Hotstarలో ఇది అందుబాటులో ఉంది.

Phone Booth (2002)

కాలిన్ ఫారెల్ అనే వ్యక్తి న్యూయార్క్‌లో ఒక పబ్లిక్ ఫోన్ బూత్‌లో చిక్కుకుపోతాడు. ఎందుకంటే ఒక స్నైపర్ అతన్ని టార్గెట్ చేసి, బూత్ నుంచి బయటకు వస్తే షూట్ చేస్తానంటాడు. ఫుల్ మూవీ ఆ బూత్‌ చుట్టూనే ఉంటుంది. మైండ్ గేమ్స్, సీక్రెట్స్ స్టోరీ నడిచే కొద్దీ రివీల్ అవుతాయి. సినిమా చూస్తుంటే మనమే అక్కడ ఉన్నట్టు ఫీల్ వస్తుంది. ఇది Prime Videoలో అందుబాటులో ఉంది.

The Descent (2005)

Advertisement

ఆరుగురు అమ్మాయిలు ఒక కేవ్‌లో అడ్వెంచర్ చేస్తారు. కానీ పెద్ద బండరాళ్ళు కూలిపోవడంతో ఇన్‌సైడ్ ట్రాప్ అయిపోతారు. అయితే అక్కడ భయంకరమైన క్రీచర్స్ వీళ్ళ పై దాడి చేస్తాయి. హారర్ మిక్స్ అయిన సర్వైవల్. చూస్తే గుండె గుభేల్ మంటుంది. Prime Video, Jio Hotstarలో ఇది అందుబాటులో ఉంది.

Room (2015) 

ఒక తల్లి, ఆమె 5 ఏళ్ల కొడుకు, ఒక చిన్న రూమ్‌లో 7 సంవత్సరాలు ట్రాప్ అయి ఉంటారు. వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేసి బంధించి ఉంటారు. బయట ప్రపంచం గురించి బాబుకు ఏమీ తెలియదు. ఎస్కేప్ ప్లాన్ చేస్తారు, కానీ టెన్షన్ పీక్ కి ఉంటుంది. ఇంటెన్స్ సీన్స్ టో ఇది బుర్రని పాడు చేస్తుంది. Prime Videoలో ఇది స్ట్రీమ్ అవుతోంది.

Read Also : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×