E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక తీర్చేనా?

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక తీర్చేనా?
Advertisement

Prabhas:టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). కోట్లాది మంది అభిమానం పొందిన ఈ గ్లోబల్ స్టార్ పెళ్లి ఎప్పుడన్నది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తన తోటి హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలతో మురిసిపోతుంటే.. తమ అభిమాన హీరో మాత్రం ఇంకా బ్యాచిలర్‌గానే మిగిలిపోవడం ఫ్యాన్స్‌ను కలచివేస్తోంది. డార్లింగ్ ఒక ఇంటివాడై, ఆ వారసుడిని ఎత్తుకోవాలని ఆశపడే ప్రతి అభిమాని గుండె లోతుల్లోని ఆవేదన ఇది.

వారసుల పండగలో తోటి హీరోలు:

తెలుగు చిత్రసీమలో ప్రభాస్ ఫ్రెండ్స్,ఆయనతో కలిసి పని చేసినవారు, ఆయన కంటే చిన్నవారు కూడా పెళ్లి పీటలెక్కారు. తాజాగా రామ్ చరణ్ ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడనే వార్తలు, వరుణ్ తేజ్ లాంటి యువ హీరోలు కూడా తండ్రి హోదాను ఎంజాయ్ చేయడం చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నుండి నితిన్ వరకు అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగు వచ్చింది. “మా డార్లింగ్ కంటే చిన్నవారంతా తమ వారసులను పరిచయం చేస్తూ పండగ చేసుకుంటుంటే, మాకు ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుంది?” అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 46 ఏళ్లు వస్తున్నా పెళ్లి ఊసే ఎత్తకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

జీవితంలోనూ రాజా సాబ్ కావాలి:

Advertisement

ఒకవైపు వ్యక్తిగత జీవితంపై చర్చ జరుగుతున్నా, ప్రభాస్ తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూనే ఉన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన రాజా సాబ్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది.ఇక ప్రభాస్ నెక్స్ట్ ‘స్పిరిట్’, ‘సలార్ 2′,’కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టుల తో రానున్నాడు. తన సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్, వ్యక్తిగత జీవితంలోనూ ఒక తోడును వెతుక్కుంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డార్లింగ్ పెళ్లి పీటల మీద కూర్చుంటే జరిగే ఆ సందడి, పండగ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ పెళ్లి అనేది కేవలం ఆయన కుటుంబానికే కాదు, కోట్లాది మంది అభిమానులకు కూడా ఒక భావోద్వేగంతో కూడిన అంశం. తమ హీరో ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, ఆయన జీవితంలోకి కూడా ఒక తోడు రావాలని కోరుకునే నిఖార్సైన అభిమానం ఇది. మరి ప్రభాస్ తన ఫ్యాన్స్ కోరికను ఎప్పుడూ తీరుస్తాడో చూడాలి.

also read: Jana Nayagan: దిగివచ్చిన మేకర్స్.. అదే డేట్ పై కన్ను!

Related News

ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

Big Stories

Advertisement
×