E-Paper
Advertisement

Tata Nexon Car: టాప్ లేపిన టాటా నెక్సాన్, కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డులు!

Tata Nexon Car: టాప్ లేపిన టాటా నెక్సాన్, కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డులు!
Advertisement

Tata Nexon Car Sales Jan 2026: ఇండియన్ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జనవరి 2026లో అమ్మకాల్లో దూసుకెళ్లింది. ఈ కంపెనీకి చెందిన ప్రముఖ SUV  నెక్సాన్, జనవరిలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా సత్తా చాటింది. ఈ కారు  ఒకే నెలలో ఏకంగా 23,365 యూనిట్ల అమ్మకాలను కొనసాగించింది. 19,629 యూనిట్లను విక్రయించిన మారుతి సుజుకి డిజైర్ సెడాన్‌ ను అధిగమించింది. ఈ కారు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెక్సాన్ అమ్మకాల్లో బెస్ట్ మంత్లీ ఫర్ఫార్మెన్స్ ను నమోదు చేసింది.

అమ్మకాల్లో నెక్సాన్, పంచ్ దూకుడు

జనవరి 2026లో నెక్సాన్, పంచ్ SUVలు ఇప్పటి వరకు అత్యధికంగా నెలవారీ అమ్మకాలను నమోదు చేశాయి. టాటాకు చెందిన మరొక ప్రసిద్ధ SUV, పంచ్ కూడా జనవరిలో 19,257 యూనిట్ల అమ్మకాలతో మంచి దూకుడు కనబరిచింది. ఈ నెల టాటాకు పకొత్త జోష్ ను తీసుకొచ్చింది.  ఎందుకంటే రెండు మోడళ్లు తమ అత్యుత్తమ నెలవారీ అమ్మకాల గణాంకాలను నమోదు చేశాయి. నెక్సాన్ కూడా 10 లక్షల యూనిట్ల కమ్యులేటివ్ సేల్స్ మార్కును దాటింది. పంచ్ కేవలం నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ఏడు లక్షల యూనిట్ల అమ్మకాలను దాటింది.

సేల్స్ లో SUVల దూకుడు

Advertisement

జనవరిలో దేశంలో అమ్మకాల లిస్టులో SUVలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ లిస్టులో టాటా నెక్సాన్, పంచ్ టాప్ లో కొనసాగుతున్నాయి. భారత ఆటోమోటివ్ మార్కెట్లో పెద్ద ట్రెండ్‌ను క్రియేట్ చేశాయి. జనవరిలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లలో 6 కార్లు SUVలు కావడం విశేషం. టాటా మోడళ్లతో పాటు, మారుతి సుజుకి బ్రెజ్జా ఈ లిస్టులోకి వచ్చి చేరింది. అటు ఎర్టిగా MPV కూడా సత్తా చాటింది.

Read Also: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?

నెక్సాన్ ఎందుకు అంత  సక్సెస్ అయ్యింది?

Advertisement

2017లో ప్రారంభించినప్పటి నుండి టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతోంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ వాహనం పెట్రోల్, CNG, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో పలు ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.  దీని పోటీ ధరల వ్యూహం కూడా ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కొనసాగించేలా ఉన్నాయి. అంతేకాకుండా, నెక్సాన్ గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఈ కారు ఫ్యామిలీ కొనుగోలుదారుల నుంచి ఎక్కువ సపోర్టును పొందుతుంది. తక్కువ ధరలో మంచి సేఫ్టీ కలిగిన కారు కావడంతో ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది జనవరిలో అత్యధిక అమ్మకాలతో సత్తా చాటింది.

Read Also: టయోటా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×