E-Paper
Advertisement

Newborn Baby in Dustbin: దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Newborn Baby in Dustbin: దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Advertisement

Newborn Baby in Dustbin: నేటి సమాజంలో మానవత్వం మంటగలిసింది. అతి దారుణంగా పసి ప్రాణాలను కూడా వదలకుండా చంపుతున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డి నగర్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మానవత్వాన్ని మరిచి, అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో పారవేశారు.

దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి, సరైన సంరక్షణ లేక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణాన్ని గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైలర్‌దేవ్‌పల్లి పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement

Also Read: పుట్టింటి నుంచి రానన్న భార్య.. పురుగుల మందు తాగి చనిపోయిన భర్త

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? కన్నవారే వదిలేశారా? లేదా నిజంగానే గుర్తు తెలియని వ్యక్తుల వదిలేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. ఏదిఏమైనా ఒక చిన్నారి పసికందును పొట్టనబెట్టుకున్నా వారిని మాత్రం అస్సలు వదలకూడదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×