E-Paper
Advertisement

2 మర్డర్స్ ఇద్దరు అనుమానితులు… ఈ మూవీ క్లైమాక్స్ ని అస్సలు ఊహించలేరు

2 మర్డర్స్ ఇద్దరు అనుమానితులు… ఈ మూవీ క్లైమాక్స్ ని అస్సలు ఊహించలేరు
Advertisement

Suspense Thriller OTT : ఒకే రాత్రి.. రెండు వేర్వేరు హత్యలు జరిగాయి.. ఇద్దరు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. అయితే వారు చెప్పేది నిజమో కాదో పోలీసులకు అర్థంకాదు. పోలీసులు కూడా గందరగోళంలో పడిన పరిస్థితిల్లో ఈ కేసులు ఎలా ముందుకు సాగుతాయి? ఈ తరహా సందేహాలు, ట్విస్ట్‌లతో సాగే మిస్టరీ థ్రిల్లర్ కథే ఇట్టెఫక్‌(Ittefaq). ఈ సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచే మన బ్రెయిన్‌ను ఆలోచనలో ముంచెత్తుతోంది. ప్రతి సన్నివేశం ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. నిజం చివరివరకు బయటపడకుండా ఉత్కంఠను కొనసాగించడం ఈ కథకు ఉన్న ప్రధాన బలం.

ఎక్కడ స్ట్రీమ్‌ అవుతోంది?

Advertisement

2017లో విడుదలైన ఈ హిందీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ చిత్రానికి అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాక్షి సిన్హా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. పాటలు, ఫైట్లు లేకుండా కథను నేరుగా ముందుకు తీసుకెళ్లడం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒకే రాత్రిలో జరిగే ఘటనతోనే మొత్తం కథను నడిపించడం దర్శకుడి ప్లానింగ్‌ను మెచ్చుకునేలా చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు, సన్నివేశాల నిర్మాణం ఈ సినిమాకు ప్రధాన అసెట్‌గా చెప్పవచ్చు.

స్టోరీ ఏంటంటే ?

Advertisement

ఒక రచయిత తన భార్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా మారుతాడు. పోలీసులు అతన్ని వెంబడిస్తుంటారు. ఆ సమయంలో అతను తప్పించుకునే ప్రయత్నంలో ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళ కూడా ఒక సమస్యలో చిక్కుకుని ఉంటుంది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఈ ఇద్దరూ ఒకే రాత్రిలో జరిగిన ఘటనల్లో భాగమవుతారు.

Also Read : సాక్ష్యాలు ఉన్నా సమాధానం దొరకని ప్రశ్న… అసలైన హంతకుడు ఆ వింత రాక్షసేనా?

ఇక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. రచయిత తన కథను చెబుతాడు. తన భార్యను తాను చంపలేదని వివరిస్తాడు. మరోవైపు ఆ మహిళ కూడా తన కథను చెబుతుంది. ఆమె చెప్పే కథలో కూడా కొన్ని నిజాలు ఉంటాయి. కానీ ఆ కథలో కూడా అనుమానాలు మిగులుతాయి. ఇద్దరి కథలు వింటే ఏది నిజమో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఈ కేసును విచారించే పోలీస్ అధికారి ఈ ఇద్దరినీ ప్రశ్నిస్తాడు. ప్రతి చిన్న ఆన్సర్‌ని గమనిస్తాడు. ఇద్దరి కథల్లో ఉన్న తేడాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఒక్కో క్లూ బయటపడే కొద్దీ కొత్త సందేహాలు వస్తాయి. ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు నిజం చెబుతున్నారనే విషయంపై స్పష్టత రాకుండా కథ ముందుకు సాగుతుంది.

క్లైమాక్స్‌కు చేరుకునే సరికి నిజం బయటపడే విధానం కథను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్తుంది. ఆ రాత్రి జరిగిన అసలు సంఘటన ఏంటి? ఎవరు నిజంగా నేరం చేశారనే విషయం చివర్లో తెలుస్తుంది. మిస్టరీని చివరి వరకు దాచిపెట్టడం ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్. ఆడియన్స్‌ను ఆలోచింపజేసే విధంగా ముగింపు ఉండటం కూడా ఈ సినిమాకి ఉన్న మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×