E-Paper
Advertisement

సాక్ష్యాలు ఉన్నా సమాధానం దొరకని ప్రశ్న… అసలైన హంతకుడు ఆ వింత రాక్షసేనా?

సాక్ష్యాలు ఉన్నా సమాధానం దొరకని ప్రశ్న… అసలైన హంతకుడు ఆ వింత రాక్షసేనా?
Advertisement

Horror Thriller OTT : హర్రర్ సినిమాలకు ఓ వర్గం, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు – సిరీస్ లకు మరో వర్గం ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఈ రెండు జానర్లు కలిపి ఒకే సినిమాగా తెరకెక్కితే ఎలా ఉంటుంది ? ఆ ఊహే క్రేజీగా ఉంది కదా. ఈ క్రేజీ ఆలోచనే మరో డైరెక్టర్ కు కూడా వచ్చినట్టు ఉంది. అందుకే ఓ అద్భుతమైన సిరీస్ తో ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు ఆయన. మరి ఆ సిరీస్ పేరేంటి ? దాన్ని ఎక్కడ చూడవచ్చు ? వంటి వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జియో సినిమాలో స్ట్రీమింగ్

స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా రూపొందిన సూపర్‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ The Outsider (2020). ఇది ఇన్వెస్టిగేషన్ డ్రామాగా మొదలై, మెల్లగా భయంకరమైన దెయ్యం కథగా మారుతుంది. ఈ సిరీస్ ప్రస్తుతం JioCinemaలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లతో సాగుతుంది ఈ లిమిటెడ్ సిరీస్. ఇందులో సినిమాటోగ్రఫీ చాలా డార్క్‌గా, భయంకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా హారర్ తో ఇన్వెస్టిగేషన్ కలిపిన తీరు ప్రేక్షకులను గ్యారెంటీగా కట్టిపడేస్తుంది. ‘True Detective’ లేదా ‘Mindhunter’ వంటి సిరీస్‌లకు ఫిదా అయితే, ఇది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

జార్జియాలోని ఒక చిన్న పట్టణంలో కథ సాగుతుంది. అక్కడే 11 ఏళ్ల బాలుడు అత్యంత దారుణంగా హత్యకు గురవుతాడు. లోకల్ పోలీస్ డిటెక్టివ్ రాల్ఫ్ ఆండర్సన్ (బెన్ మెండెల్సన్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. సాక్ష్యాధారాల ఆధారంగా ఆ ఊరిలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కోచ్ టెర్రీ మైట్లాండ్ (జాసన్ బాట్‌మన్) ను అనుమానితుడుగా అరెస్ట్ చేస్తాడు. సిసిటివి ఫుటేజ్, వేలిముద్రలు అన్నీ టెర్రీనే హంతకుడని నిరూపిస్తాయి.

కానీ ట్విస్ట్ ఏంటంటే… టెర్రీ ఆ హత్య జరిగినప్పుడు వందల మైళ్ల దూరంలో ఒక కాన్ఫరెన్స్‌ లో ఉన్నాడని బలమైన ఆధారాలు దొరుకుతాయి. ఒకే మనిషి ఒకే సమయంలో రెండు చోట్ల ఉండడం ఏంటనే గందరగోళంతో, అదే ప్రశ్నతో కథ ఉత్కంఠగా మారుతుంది. ఈ కేసును సాల్వ్ చేయడానికి రాల్ఫ్, అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ హోలీ గిబ్నీని హెల్ప్ అడుగుతాడు. హోలీ తన ఇన్వెస్టిగేషన్‌ లో ఇలాంటి వింతైన కేసులు గతంలో కూడా జరిగాయని చెప్తుంది. ఇది మనిషి చేసిన హత్య కాదని అంటుంది. అలాగే మనిషిలా రూపాన్ని మార్చుకోగలిగే ఒక అతీంద్రియ శక్తి పని అని ఆమె నమ్ముతుంది. ఈ శక్తి మనుషుల బాధను, భయాన్ని తిని బతుకుతుందని తెలుసుకుంటారు.

Advertisement

Also Read : గతం మరిచే నటి… ఊహకు అందని మలుపులతో పిచ్చెక్కించే మూవీ

అది ఎవరిని తాకితే వారి రూపంలోకి మారి హత్యలు చేస్తుందని ఆమె గ్రహిస్తుంది. మొదట్లో రాల్ఫ్ ఈ దెయ్యం కథలను అస్సలు నమ్మడు. కానీ వరుసగా జరుగుతున్న వింత మరణాలు, ఆ అదృశ్య శక్తి తన కుటుంబాన్ని కూడా భయ పెట్టడం స్టార్ట్ చేశాక ఆయనకు అర్థం అవుతుంది. ఆ “అవుట్‌సైడర్” ఒక గుహలో దాక్కుని తన నెక్స్ట్ వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ క్రమంలో రాల్ఫ్, హోలీ ఆ రాక్షసిని ఎలా అంతం చేశారు ? అనేదే మిగిలిన కథ.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×