E-Paper
Advertisement

Suspense Thriller OTT : ప్లేట్లో మనిషి మొహంతో మాంసం ట్రీట్… ఒళ్ళు జలదరించే హార్రర్ భయ్యా

Suspense Thriller OTT : ప్లేట్లో మనిషి మొహంతో మాంసం ట్రీట్… ఒళ్ళు జలదరించే హార్రర్ భయ్యా
Advertisement

Suspense Thriller OTT : ఒక లో బడ్జెట్ హారర్ థ్రిల్లర్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని భయపెడుతోంది. ఈ సినిమా ముఖ్యంగా వలసదారులు ఎదుర్కొనే వేధింపులను థ్రిల్లర్ కథాంశంతో చూపిస్తుంది. ఒక చోట మనుషుల్ని జంతువుల్ని వేటాడినట్లు వేటాడి, వాళ్ళను మటన్ లా ఆరగిస్తుంటారు. అయితే ఆ ఉచ్చులో ఒక తల్లి తన బిడ్డతో ఇరుక్కుంటుంది. ఇక స్టోరీ చివరివరకు మొత్తం ఉత్కంఠంగా సాగుతుంది. ఈ థ్రిల్లర్  సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సైలెన్స్ ఆఫ్ ది ప్రే’ (Silence of the Prey). ఇది 2024 మే 14న విడుదలైంది. కరీనా కుడ్జినా, మైఖేల్ వైన్‌బర్గ్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో కరీనా కుడ్జినా మెయిన్ హీరోయిన్ గా, కో-డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇక క్రిస్ లాపాంటా, మాంటే బెజెల్ ముఖ్య పాత్రలు పోషించారు. 1 గంట 20 నిమిషాల ఈ స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

కథలోకి వెళ్తే

బెలారస్‌లో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు చేసినందుకు జైలు శిక్ష పడుతుందనే భయంతో, నీనా అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె ఇసాబెల్లాతో కలిసి అమెరికాకు అక్రమంగా వలస వస్తుంది. అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో, ఆమెకు ఒక మారుమూల గ్రామంలో ఉండే లూథర్ అనే వృద్ధుడికి కేర్‌టేకర్‌గా పని దొరుకుతుంది. అతను మొదట చూడటానికి చాలా మంచిగా ఉన్నట్లు అనిపిస్తాడు. అయితే ఆ తరువాత కథ మొత్తం మారిపోతుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి.

Advertisement

లూథర్ ఇంట్లో నీనా చేరిన తర్వాత, అతని ప్రవర్తన వింతగా ఉంటుంది. అతను వలసదారుల పట్ల వివక్ష చూపిస్తూ, వారిని వేటాడటం తన అలవాటుగా మార్చుకున్నాడని నీనాకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ గ్రామంలో వలసదారులను జంతువుల్లా భావిస్తూ, వారిని వేటాడి చంపి తినే భయంకరమైన ఆచారాన్ని పాటిస్తుంటారు. నీనా కూడా తర్వాతి ఎర అని ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ఇక నీనా తన కూతురు ఇసాబెల్లాను కాపాడుకుంటూ, ఆ భయంకరమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడింది అనేది మిగతా కథ.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×