E-Paper
Advertisement

Crime Thriller OTT: ఒకే ఇంట్లో 11 మంది మర్డర్… నిమిషానికో ట్విస్ట్… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

Crime Thriller OTT: ఒకే ఇంట్లో 11 మంది మర్డర్… నిమిషానికో ట్విస్ట్… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ
Advertisement

Crime Thriller OTT : దేశంలోనే సంచలనం సృష్టించిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఒక డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇది ఒకే ఇంట్లో 11మంది చనిపోయిన భయంకరమైన ఘటన. అసలు ఎందుకు అలా జరిగిందని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్క వ్యక్తి వల్ల ఇంత దారుణం జరిగిందని తెలుసుకుని ఆ తారువాత ప్రజలు కూడా బాధ పడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘోరమైన ఇన్సిడెంట్ మూడు ఎపిసోడ్ల రూపంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’ (House of Secrets: The Burari Deaths) 2021లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. ఇది 2018లో ఢిల్లీలోని బురారీలో జరిగిన భయంకరమైన 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ మరణాల రియల్ స్టోరీని వివరిస్తుంది. దర్శకుడు కేశవ్ భట్టాచార్య సిరీస్ ని రియల్ ఫుటేజ్ తో ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లను బాగా అనాలిసిస్ చేసి డాక్యుమెంటరీని తీశారు. దీనికి ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. మూడు ఎపిసోడ్స్ తో ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ (netflix) లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  సలసలా మరిగే సముద్రం… స్విమ్మింగ్ కెళ్ళి ఉడికిపోయే అమ్మాయి… గుండె గల్లంతయ్యే సీన్లు

స్టోరీ ఏమిటంటే

2018 జులై 1న ఢిల్లీలోని బురారీలో ఒక ఇంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 11 మంది ఉరి వేసుకుని చనిపోయినట్లు డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఇందులో నరేంద్ర భాటీ పెద్దవాడు, అతని భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు, భార్య తల్లి, ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. ఇది సూసైడ్ లాగా కనిపించినా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఇది సూసైడ్ కాదని తెలుస్తుంది. నిజానికి ఇది ఒక భయంకరమైన బిలీఫ్ సిస్టమ్ వల్ల జరిగింది.

Advertisement

ఫ్యామిలీ హెడ్ అయిన నరేంద్ర్ భాటీకి ఒక రకమైన స్పిరిట్యువల్ ని నమ్మాడు. ఇదంతా దాని వల్లే జరిగింది. అతను తన తండ్రి ఆత్మ తనలో ప్రవేశించిందని నమ్మాడు. అతను ఫ్యామిలీని మానిప్యులేట్ చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్ రాత్రిపూట మోక్షం పొందాలని ఒక రిచ్యువల్ చేస్తారు. ఇది సూసైడ్ గ్రూప్ రిచ్యువల్‌గా మారిపోతుంది. అసలు ఫ్యామిలీ మెంబర్స్ మైండ్‌సెట్ ఎలా మారిందనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వివరంగా చూపించారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడా జరిగాయి కూడా. అయితే ఈ క్రైమ్ మాత్రం సంచలనంగా మారింది.

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×