BIG TV Malayalam: దక్షిణాది మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న BIG TV, ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని కేరళకు విస్తరించింది. ‘BIG TV 24X7’ పేరుతో మలయాళ వార్తా ఛానల్‌ను అధికారికంగా ప్రారంభించింది. మలయాళీ ప్రేక్షకులకు సరికొత్త వార్తా అనుభూతిని పంచడమే లక్ష్యంగా “గాడ్స్ ఓన్” కంట్రీలో అడుగుపెట్టిన ఈ ఛానల్, కేరళ వార్తా ప్రసారాల సరళిని మార్చడానికి సిద్ధమైంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును BIG TV ఛైర్మన్ వెన్నం విజయ్‌కాంత్ రెడ్డి, కేరళ మలయాల ఛానల్ MD అనిల్ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో BIG TV సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని, కేరళ ప్రజలకు కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేరళ సంస్కృతి, సామాజిక అంశాలకు పెద్దపీట వేస్తూ నిష్పక్షపాత వార్తలను అందించడమే తమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
సాంకేతికత విషయంలో BIG TV ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ప్రసారాల్లో ప్రత్యేక ఆకర్షణ.. ముఖ్యంగా AR (Augmented Reality), VR (Virtual Reality) గ్రాఫిక్స్‌ను ఉపయోగించడం ద్వారా, వార్తలను కేవలం సమాచారంగా కాకుండా ఒక దృశ్య కావ్యంలా ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ హై-ఎండ్ టెక్నాలజీ వల్ల వీక్షకులకు వార్తల్లో లీనమయ్యే సరికొత్త అనుభవం కలుగుతుంది.
వార్తా కవరేజ్‌లో వేగం (Speed), ఖచ్చితత్వం (Accuracy) అనే రెండు సూత్రాలను ప్రాతిపదికగా తీసుకుని BIG TV 24X7 పనిచేయనుంది. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, క్షణాల్లో వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందుకు తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో బలమైన రిపోర్టర్ల నెట్‌వర్క్‌ను ఛానల్ ఏర్పాటు చేసుకుంది. సంచలనాల కోసం కాకుండా, సత్యం కోసం తపించే జర్నలిజానికి కేరళలో తాము కేరాఫ్ అడ్రస్‌గా మారుతామని యాజమాన్యం ప్రకటించింది.
Also Read: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్.. మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న, వారి మాటేంటి?
డిజిటల్ విప్లవం కొనసాగుతున్న తరుణంలో, టీవీ ప్రసారాలతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా మలయాళీ ప్రేక్షకులకు BIG TV చేరువ కానుంది. విశ్లేషణాత్మక చర్చలు, లోతైన పరిశోధనాత్మక కథనాలు, ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో కేరళ మీడియా మార్కెట్‌లో BIG TV 24X7 ఒక బలమైన శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.
కేరళలో అడుగుపెట్టిన BIG TV
BIG TV 24X7 పేరుతో BIG TV మలయాళం న్యూస్ ఛానల్ లాంఛ్
ఛానల్ ప్రారంభించిన ఛైర్మన్ వెన్నం విజయ్‌కాంత్ రెడ్డి
నేటి నుంచి ప్రారంభమైన BIG TV 24X7 ప్రసారాలు
అత్యాధునిక స్టూడియో, AR, VR గ్రాఫిక్స్‌తో ప్రసారాలు
న్యూస్ కవరేజ్‌లో వేగం, ఖచ్చితత్వం… https://t.co/FiyRsewlNZ pic.twitter.com/6BHzwyPj5t
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2026