BigTV English
Advertisement

OTT Movie : ఆ గీత దాటితే శరీరం కరిగి, మిగిలేది ఎముకలు మాత్రమే… ఈ సీక్రెట్ మాస్క్ మనిషి అరాచకం చూస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : ఆ గీత దాటితే శరీరం కరిగి, మిగిలేది ఎముకలు మాత్రమే… ఈ సీక్రెట్ మాస్క్ మనిషి అరాచకం చూస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : ఓటీటీలోకి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా ఇష్టంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ జార్జియా గ్రామీణ ప్రాంతంలో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు, ప్రాణాంతకమైన ముప్పును ఎదుర్కొనే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది 2024లో 52వ సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ హారర్ టెలివిజన్ సిరీస్‌కు నామినేట్ అయింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


రెండు ఓటీటీలలో 

ఈ అమెరికన్ హారర్-సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘టీకప్’ (Teacup). ఇది రాబర్ట్ R. మెక్‌కామన్ రాసిన “స్టింగర్” నవల నుండి స్ఫూర్తి పొందింది. దీనికి ఇయాన్ మెక్‌కల్లోచ్ సృష్టికర్తగా, జేమ్స్ వాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో యవోన్ స్ట్రాహోవ్స్కీ, స్కాట్ స్పీడ్‌మన్, చాస్కీ స్పెన్సర్, కాథీ బేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2024 అక్టోబర్ 10న పీకాక్‌లో ప్రీమియర్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా IMDbలో 6.3/10, రాటెన్ టొమాటోస్ లో 77% రేటింగ్ ను కలిగి ఉంది. ఇది పీకాక్ (Peacock) జియో హాట్ స్టార్ (Jio hotstar)లలో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ జార్జియా గ్రామీణ ప్రాంతంలోని ఒక ఫార్మ్‌లో ప్రారంభమవుతుంది. ఇక్కడ చెనోవెత్ అనే కుటుంబం నివసిస్తుంటుంది. మాగీ చెనోవెత్ ఒక పశువైద్యురాలు. ఆమె తన భర్త జేమ్స్, కుమార్తె మెరిల్, కొడుకు ఆర్లో, జేమ్స్ తల్లి ఎల్లెన్ తో కలసి జీవిస్తుంటుంది. ఈ సిరీస్ ఒక భయంకరమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఒక మహిళ గాయాలతో అడవిలో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ సన్నివేశం ఒక భయంకరమైన ముప్పుకు దారి తీస్తుంది. తర్వాత చెనోవెత్ నడిపే ఫార్మ్‌లోని ఒక కందిరీగను, ఆర్లో తన గదిలోని ఒక టీకప్‌ లో బంధిస్తాడు. అయితే ఇంతలో ఫార్మ్‌లోని జంతువులు వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. ఆర్లో ఒక జంతువును వెంబడిస్తూ అడవిలో కనిపించకుండా పోతాడు.

ఈ సమయంలో ఒక మాస్క్ ధరించిన వ్యక్తి కనిపిస్తాడు. ఫార్మ్ చుట్టూ నీలి రేఖను గీస్తూ, దానిని దాటవద్దని అందరినీ హెచ్చరిస్తాడు. ఈ నీలి రేఖను దాటిన ఎవరైనా ఒక భయంకరమైన భయాందోళనకు గురవుతారు. ఇది ఒక విషాదకరమైన మరణానికి దారితీస్తుంది. ఇక్కడ విద్యుత్, సెల్‌ఫోన్ సిగ్నల్స్, కార్లు పనిచేయడం మానేస్తాయి. ఫార్మ్‌లోని వారందరూ పూర్తిగా భయాందోళనలకు గురవుతారు. మరో వైపు ఆర్లో, గాయాలతో వింతగా ప్రవర్తిస్తూ తిరిగి వస్తాడు. అతని శరీరంలో ఒక అసాధారణ శక్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ముప్పు ఒక అతీంద్రియ జీవితో సంబంధం కలిగి ఉందని, ఇది శరీరాలను ఆక్రమించే సామర్థ్యం కలిగి ఉందని తెలుస్తుంది. ఇది ఆర్లో లో కూడా ప్రవేశిస్తుంది. చివరికి ఆ ఫార్మ్ లో ఏం జరుగుతోంది ? దాని చుట్టూ ఎందుకు గీత గీశారు ? ఆ దుష్ట శక్తి రహస్యం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.

Read Also : సినిమా చరిత్రలోనే మోస్ట్ బ్యాన్డ్ మూవీ… ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా రిజెక్ట్… ఇందులో అంతగా ఏముందంటే?

Related News

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

Big Stories

×