BigTV English

OTT Movie : సముద్రం మధ్యలో కంటైనర్ లో ప్రెగ్నెంట్ భార్యతో… నెక్స్ట్ ఏమవుతుందా అనే టెన్షన్ తోనే పోతారు

OTT Movie : సముద్రం మధ్యలో కంటైనర్ లో ప్రెగ్నెంట్ భార్యతో… నెక్స్ట్ ఏమవుతుందా అనే టెన్షన్ తోనే పోతారు

OTT Movie : సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఒక ఉత్కంఠభరితమైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక స్త్రీ తన శిశువుతో సముద్రంలో ఒక షిప్పింగ్ కంటైనర్‌లో చిక్కుకుంటుంది. ఆతరువాత ఆమె అక్కడ బతకడానికి పోరాడే సంఘటనల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. 85.7 మిలియన్ వ్యూస్ తో 2023లో అత్యధికంగా వీక్షించబడిన నాన్-ఇంగ్లీష్ చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘నోవేర్’ (Nowhere) 2023 లో వచ్చిన స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం. దీనికి ఆల్బర్ట్ పింటో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియానా లిస్టా కథ ఆధారంగా రూపొందింది. ఇందులో అన్నా కాస్టిలో, తమర్ నోవాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 సెప్టెంబర్ 29 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 1 గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.3/10, రాటెన్ టొమాటోస్ లో 64% రేటింగ్ ను కలిగి ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ లో ప్రారంభమవుతుంది. ఆహారం, నీరు, ఇతర వనరుల కొరత కారణంగా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ ప్రభుత్వం జనాభాను నియంత్రించడానికి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులను చంపే క్రూరమైన చర్యలకు పాల్పడుతుంది. ఒక గర్భిణీ స్త్రీ అయిన మియా, ఆమె భర్త నికో తమకు పుట్టబోయే బిడ్డ భద్రత కోసం స్పెయిన్ నుండి ఐర్లాండ్‌కు తప్పించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతకు ముందు తమ మొదటి బిడ్డ అమాను సైన్యం తీసుకెళ్లడంతో, ఇప్పుడు ఈ బిడ్డని కూడా చంపుతారేమో అని భయపడుతుంటారు. మియా, నికో హ్యూమన్ ట్రాఫికర్ల సహాయంతో, ఒక కార్గో షిప్పింగ్ కంటైనర్‌లో దాక్కుని ఐర్లాండ్‌కు పారిపోవాలని ప్లాన్ చేస్తారు. అయితే ఒక చెక్‌పాయింట్ వద్ద నికో, మియా విడిపోవాల్సివస్తుంది.

మియా ఒక కంటైనర్‌లో ఒంటరిగా దాక్కుని బయటపడుతుంది. కంటైనర్‌లు షిప్‌పై లోడ్ చేయబడిన తర్వాత, ఒక భయంకరమైన తుఫాను కారణంగా మియా ఉన్న కంటైనర్ సముద్రంలో పడిపోతుంది. నీరు నిండుతున్న కంటైనర్‌లో, ఆమె ఒక రాత్రి తుఫాను సమయంలో తన కుమార్తె నోవాకు జన్మనిస్తుంది. మియా, తీవ్రంగా బలహీనపడినప్పటికీ, తన శిశువు కోసం బతకడానికి పోరాడుతుంది. నికో ఆమెను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. మియా తన శిశువు నోవాతో, కంటైనర్ పైకప్పును డ్రిల్‌తో రంధ్రం చేసి బయటపడుతుంది. ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూస్తుంటుంది. మియా తన బిడ్డతో కలసి ప్రాణాలతో బయటపడుతుందా ? నికో ఆమెను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు ? అనే విషయాలను ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : భయపడితే బలం పెంచుకునే దెయ్యం… సైకియాట్రిస్ట్ కి బతికుండగానే నరకం… ఉలిక్కిపడే సీన్స్ ఎన్నో

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×