E-Paper
Advertisement

Netflix : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉన్న 2 గంటల 45 నిమిషాల లవ్ స్టోరీ… ఇంకా చూడలేదా ?

Netflix : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉన్న 2 గంటల 45 నిమిషాల లవ్ స్టోరీ… ఇంకా చూడలేదా ?
Advertisement

Netflix OTT : ధనుష్, కృతి సనన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ‘తేరే ఇష్క్ మే’ సినిమాని ప్రేక్షకులు రిపీట్ వాచ్ చేస్తున్నారు.  సుమారు ₹161 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్‌లో స్టెడీ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత భారీ బజ్ వచ్చింది. ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది ? ఎక్కడ చూడాలి? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో ట్రెండ్ అవుతుందంటే

కృతి సనన్, ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ (Tere ishk mein) ఇటీవల ఓటీటీలో ప్లాట్‌ఫామ్‌లో విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఈ చిత్రం 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. 2026 జనవరి 23 నుంచి Netflix ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఇది హిందీ, తెలుగు, తమిళ్ ఆడియోల్లో కూడా  అందుబాటులో ఉంది. A.R. రెహమాన్ మ్యూజిక్ సూపర్ అని చెప్పుకోవాలి. టైటిల్ సాంగ్, Usey Kehna వంటివి హార్ట్ టచ్ చేస్తాయి. ఈ 2 గంటల 45 నిమిషాల ఎమోషనల్ రోలర్‌కోస్టర్ ని మిస్ కాకుండా చూడండి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

శంకర్ (ధనుష్) ఢిల్లీలో చదువుకునే ఒక కోపిష్టి యువకుడు. తన రౌడీయిజంతో కాలేజీలో అందరినీ భయపెడుతుంటాడు. అదే కాలేజీలో సైకాలజీ చదువుతున్న ముక్తి (కృతి సనన్), అతని కోపాన్ని ప్రేమతో అదుపు చేయవచ్చనే తన థీసిస్ పరిశోధన కోసం శంకర్‌ను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో శంకర్ ముక్తిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ ఆమె తనను కేవలం ఒక పరిశోధనగా మాత్రమే చూసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురవుతాడు. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్థలు, ముక్తి తండ్రి (ప్రకాష్ రాజ్) చేసిన అవమానం కారణంగా శంకర్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

కొన్నేళ్ల తర్వాత, శంకర్ భారత వైమానిక దళంలో పైలట్‌గా చేరి దేశం కోసం పనిచేస్తుంటాడు. కానీ అతని పాత స్వభావం మాత్రం మారదు. క్రమశిక్షణా ఉల్లంఘన కారణంగా అతను పనీష్ కూడా అవుతాడు. అతని మానసిక స్థితిని పరీక్షించడానికి కౌన్సెలర్‌గా ముక్తి మళ్ళీ అతని జీవితంలోకి వస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనేది సినిమా చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : 4 అవార్డులు 9 అంతర్జాతీయ నామినేషన్లు… IMDbలో 7.2 రేటింగ్‌… ఇది కదా క్రైమ్ థ్రిల్లర్ అంటే

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×