E-Paper
Advertisement

Mohsin Naqvi: పాకిస్తాన్ ప్ర‌ధానిని అవ‌మానించిన న‌ఖ్వీ..మందు తాగి వివాద‌స్ప‌ద‌ ట్వీట్

Mohsin Naqvi: పాకిస్తాన్ ప్ర‌ధానిని అవ‌మానించిన న‌ఖ్వీ..మందు తాగి వివాద‌స్ప‌ద‌ ట్వీట్
Advertisement

Mohsin Naqvi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) అతిత్వరలోనే ప్రారంభం కానుంది. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తీవ్ర గందరగోళ‌ పరిస్థితిలు నెలకొంటున్నాయి. ఇప్పటికే T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. పాకిస్తాన్ కూడా తప్పుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Shehbaz Sharif )తో సోమవారం రోజున సమావేశం అయ్యారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi). ఈ సందర్భంగా టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో పాల్గొనడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టి వివాదంలో ఇరుక్కున్నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ. ఇందులో ఇండియన్ రెచ్చగొట్టేటట్టు పోస్ట్ పెట్టిన మొహ్సీన్ న‌ఖ్వీ, పాకిస్తాన్ ప్రధాని పేరును మాత్రం తప్పుగా ప్రస్తావించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

పాకిస్తాన్ ప్ర‌ధానిని అవ‌మానించిన న‌ఖ్వీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనడంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Shehbaz Sharif ) తో దాదాపు గంటసేపు సోమవారం రోజున సమావేశం అయ్యారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi). అయితే ఈ సమావేశం అనంతరం ప్రధాని షరీఫ్ ను కలిసినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు మొహ్సీన్ న‌ఖ్వీ. ఐతే ఇక్కడే పెద్ద తప్పిదం చేశారు. పాకిస్తాన్ ప్రధాని పేరు షెహబాజ్ షరీఫ్. కానీ మనోడు పాకిస్తాన్ ప్రధాని పేరును తప్పుగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. షెహబాజ్ షరీఫ్ ను కాస్త నవాజ్ షరీఫ్ అంటూ వెల్లడించారు న‌ఖ్వీ. అది చూసుకోకుండానే పోస్ట్ చేయడం జరిగింది. దీంతో మొహ్సీన్ న‌ఖ్వీ పై దారుణంగా ట్రోల్లింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. పాకిస్తాన్ ప్రధాని ఎవరు ? అనే విషయం తెలియకుండానే మొహ్సీన్ న‌ఖ్వీ ఎలా పోస్ట్ చేశాడని ప్రశ్నిస్తున్నారు. బాబర్ ఆజం ఒక్కడికే ఇంగ్లీష్ రాదని అందరూ అనుకున్నారు… ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడిపే మొహ్సీన్ న‌ఖ్వీ గాడికి కూడా ఇంగ్లీష్ రాదని దారుణంగా ఆడుకుంటున్నారు. ప్రధాని పేరు కూడా తెలియని వాడిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా ఎలా చేశారని నిలదీస్తున్నారు. ఇలాంటి వాడిని దేశం నుంచి బహిష్కరించాలని కూడా ఇండియన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

న‌ఖ్వీ ట్వీట్ లో ఏముందంటే ?

త‌న ట్వీట్ లో ప్ర‌ధాని పేరు త‌ప్పుగా ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొన‌డంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు న‌ఖ్వీ. ఈ శుక్ర‌వారం, లేదా వ‌చ్చే సోమ‌వారం రోజున టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొన‌డంపై నిర్ణయాన్ని ప్ర‌క‌టిస్తామ‌న్నారు. కాగా ఇప్ప‌టికే పాకిస్తాన్ జ‌ట్టును కూడా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం ప్ర‌క‌టించింది పాక్ బోర్డు.

Advertisement

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

 

 

 

Related News

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

Big Stories

Advertisement
×