E-Paper
Advertisement

Thalaivar Thambi Thalaimaiyil OTT : ఓటీటీలోకి వచ్చేసిన జీవా పొలిటికల్ సెటైర్ డ్రామా… తెలుగులోనూ స్ట్రీమింగ్

Thalaivar Thambi Thalaimaiyil OTT : ఓటీటీలోకి వచ్చేసిన జీవా పొలిటికల్ సెటైర్ డ్రామా… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Thalaivar Thambi Thalaimaiyil OTT : లైట్ హార్టెడ్ కామెడీ సినిమాలంటే ఇష్టమా ? అయితే ఈ వీకెండ్ కు మీ కోసం ఓ మంచి మూవీ సిద్ధంగా ఉంది. రీసెంట్ గానే థియేటర్లలో సందడి చేసిన ఆ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ తమిళ మూవీ పేరు ‘తలైవర్ తంబి తలైమైయిల్’ (TTT – Thalaivar Thambi Thalaimaiyil Movie). 2026 జనవరి 15న విడుదలైన తమిళ విలేజ్ కామెడీ డ్రామా ఇది. పొంగల్ సీజన్‌లో ముందుగానే విడుదలై, మంచి మౌత్ టాక్ తో దూసుకెళ్లింది ఈ చిత్రం. విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ వాయిదా పడటం వల్ల ఈ సినిమా ముందుగానే థియేటర్లలోకి వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యింది.

Advertisement

తెలుగు, కన్నడ, మలయాళ ఆడియో వెర్షన్‌లలో కూడా డిజిటల్ గా అందుబాటులో ఉండడం విశేషం. ఇందులో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరో జీవా మెయిన్ లీడ్ గా నటించాడు. తంబి రామయ్య, ఇళవరసు, ప్రార్థన నాథన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నన్ రవి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కింది. విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు. సుమారు 120 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ మూవీ IMDbలో 7.2 రేటింగ్ సంపాదించింది. ఫ్యామిలీ అంతా కలిసి చూడడానికి ఈ వీకెండ్ ఉన్న బెస్ట్ ఓటీటీ సినిమాలలో ఇది కూడా ఒకటి.

Also Read : డిప్రెషన్ లో ఉన్నవాళ్లకు హ్యాపీనెస్ తెచ్చే మూవీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమా కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. మన హీరో జీవరత్నం (జీవా) అనే స్థానిక పంచాయతీ నాయకుడు. వివాహాలు, అంత్యక్రియలు వంటి గ్రామ వ్యవహారాలను తనే చూసుకుంటాడు. ఒక రోజు ఆ ఊళ్ళో ఒక ఇంట్లో వివాహం జరుగుతుంది. అదే తేదీన పెళ్లి జరుగుతున్న పొరుగు ఇంట్లో చోటు చేసుకున్న చావుతో అంత్యక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే అప్పటికే ఆ ఇళ్ల మధ్య శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఓ ఇంట్లో శుభకార్యం, మరో ఇంట్లో చావు కార్యంతో వివాదం రాజుకుంటుంది. దీంతో ఆ గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత జీవరత్నం మీద పడుతుంది.

అతను ఎవరివైపు మాట్లాడకుండా, గ్రామస్తులను శాంతింపజేసి, కార్యక్రమాలను సాఫీగా నడిపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ గ్యాప్ లో చాలా కామెడీ సంఘటనలు జరుగుతాయి. పెళ్లి బ్యాండ్, అంత్యక్రియల సంగీతం కలిసిపోవడం, పొరుగువారి గొడవలు, జీవరత్నం ఆ గంగరగోళంలో చిక్కుకోవడం వంటివి. స్థానిక నాయకులు ఎదుర్కొనే సమస్యలు, గ్రామీణ జీవితంలో చోటు చేసుకునే కామెడీ వంటివి కూడా చూడవచ్చు. చివరికి జీవరత్నం తన చాకచక్యంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. మరి ఇంతకీ హీరో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు ? అన్నది ఓటీటీలో చూడాల్సిందే.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×