Suryakumar Yadav: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan game) మధ్య జరగబోయే మ్యాచ్ కు అభిషేక్ శర్మ ( Abhishek Sharma) దూరమవుతాడని తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav) హింట్ ఇచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర అనారోగ్యం ( abhishek sharma health update) నుంచి ఇంకా కోలుకోలేదని తాజాగా వెల్లడించారు సూర్య కుమార్ యాదవ్. నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సూర్య కుమార్ యాదవ్. నమీబియాతో దూరమైన అభిషేక్ శర్మ (Abhishek Sharma), మరో ఒకటి లేదా రెండు మ్యాచ్ లకు దూరమయ్యే ఛాన్సులు ఉన్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తాడు అనుకుంటే అభిషేక్ శర్మ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ లో మొట్టమొదటి మ్యాచ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఇండియా ఆడింది. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ముంబై హోటల్లో తిన్న ఫుడ్ కారణంగా అతనికి వైరల్ ఫీవర్ సోకినట్లు చెబుతున్నారు. అనంతరం టీమిడియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన డిన్నర్ తర్వాత అభిషేక్ శర్మకు కడుపునొప్పి లేసిందట. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కారణంగానే గురువారం జరుగుతున్న నమీబియా మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు.
ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వెల్లడించారు. అభిషేక్ శర్మ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలిపారు సూర్య కుమార్ యాదవ్. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకోవడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుందన్నారు. అంటే ఈ లెక్కన నమిబియా తో పాటు మరో రెండు మ్యాచ్ లు అభిషేక్ శర్మ ఆడడం కష్టమేనని హింట్ ఇచ్చారు సూర్య కుమార్ యాదవ్. దీంతో ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan game) మధ్య మ్యాచ్ కు అభిషేక్ శర్మ ( Abhishek Sharma) దూరమవుతాడని తెలుస్తోంది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అభిషేక్ శర్మ లేకపోతే ఇండియా గెలవడం కష్టమే అంటున్నారు.
🚨 BIG STATEMENT BY SURYA KUMAR YADAV ON ABHISHEK SHARMA 🚨
Suryakumar Yadav said 🗣️
"Abhishek Sharma is still not fine – he will miss a game or two game".🤯 pic.twitter.com/NOTTO5NDGJ
— lndian Sports Netwrk (@IS_Netwrk29) February 12, 2026