BigTV English

OTT Movie : తెల్లార్లూ ఎంజాయ్… ఉదయాన్నే ఒంటిపై నూలు పోగు లేకుండా… ఎవరితో ఆ పని చేసిందో కూడా గుర్తులేనంతగా…

OTT Movie : తెల్లార్లూ ఎంజాయ్… ఉదయాన్నే ఒంటిపై నూలు పోగు లేకుండా… ఎవరితో ఆ పని చేసిందో కూడా గుర్తులేనంతగా…

OTT Movie : ఓటీటీ ఇప్పుడు అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇందులో రొమాంటిక్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్  సినిమా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు మొదటి అనుభవం తనకు తెలీకుండానే జరిగిపోతుంది. ఈ స్టోరీ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఓవైపు కామెడీతో, మరోవైపు ఎమోషన్ తో సాగిపోతుంది. చివరి వరకూ ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ (Thank You for Coming). 2023 లో వచ్చిన ఈ మూవీకి కరణ్ బూలాని దర్శకత్వం వహించగా, రియా కపూర్, ఏక్తా కపూర్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ నటించారు.ఈ స్టోరీ కనికా కపూర్ అనే 32 ఏళ్ల సింగిల్ మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కనికా ఢిల్లీలో తన తల్లి బీనా, అమ్మమ్మ కిషోరితో కలిసి జీవిస్తుంది. కనికా చిన్నప్పటి నుండి తన తల్లి సింగిల్ మదర్ కావడం వల్ల సమాజంలో అవమానాలు ఎదుర్కొంటుంది. ఆమె జీవితంలో ప్రేమ, సంతృప్తి కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆమె సంబంధాలు ఎప్పుడూ ఆమెకు కావాల్సిన ఆనందాన్ని ఇవ్వలేవు. అయితే 32 ఏళ్లు వచ్చినా ఆమెకు మొదటి అనుభవం కూడా జరిగి ఉండదు. అందుకోసం ఆమె బాగా  పరితపిస్తుంది. కనికా తన స్నేహితులు పల్లవి, టీనా తో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆమె 32వ పుట్టినరోజు సమయంలో, తన జీవితంలో సంతృప్తి లేకపోవడంతో నిరాశగా ఉంటుంది. అదే సమయంలో, ఆమె స్నేహితుడు జీవన్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి ప్రతిపాదన తెస్తాడు. కనికా, ప్రేమలో నిజమైన ఆనందం కోసం వెతుకుతూ, అతనితో నిశ్చితార్థం చేసుకోవడానికి అంగీకరిస్తుంది.

అయితే, ఆమె నిశ్చితార్థం రాత్రి కనికా బాగా తాగుతుంది. మరుసటి రోజు ఆమె వంటిమీద బట్టలు కూడా లేకుండా ఒక గదిలో ఉంటుంది. ఆమె రాత్రి ఎవరితోనొ పడకను పంచుకుంది. కానీ ఆ రాత్రి ఏం జరిగింది? ఎవరితో జరిగింది ? ఎంతమందితో జరిగింది ? అనేది ఆమెకు గుర్తులేదు. ఇక్కడ నుండి కథ ఒక హాస్యభరితమైన మలుపు తీసుకుంటుంది. ఆమె ఆ రాత్రి జరిగిన విషయాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో, ఆమె తన స్నేహితులు, మాజీ ప్రియులు, కుటుంబంతో కలిసి అనేక భావోద్వేగ, హాస్య సన్నివేశాలను ఎదుర్కొంటుంది. చివరికి ఆరాత్రి ఎవరితో ఆ పని జరిగిందో కనికా తెలుసుకుంటుందా ? లేదా ? అనేది మూవీ చూసి తెలుసుకోండి.

Also Read : బర్త్ డే పార్టీలో గందరగోళం … ఎవరికి వాల్లే రసిక రాజులు … సీక్రెట్ ని బయట పెట్టే సెల్ ఫోన్

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×