BigTV English

OTT Movie : బర్త్ డే పార్టీలో గందరగోళం … ఎవరికి వాల్లే రసిక రాజులు … సీక్రెట్ ని బయట పెట్టే సెల్ ఫోన్

OTT Movie : బర్త్ డే పార్టీలో గందరగోళం … ఎవరికి వాల్లే రసిక రాజులు … సీక్రెట్ ని బయట పెట్టే సెల్ ఫోన్

OTT Movie : ఓటిటిలోకి కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులకు తగ్గట్టు దర్శకులు కూడా కొత్త కొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ సెల్ ఫోన్ల చుట్టూ తిరుగుతుంది. ఒక పార్టీలో కపుల్స్ మధ్య ఫోన్ లో ఉన్న రహస్యాలు బయటికి వస్తాయి. అసలు స్టోరీ అప్పుడే మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏంటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….


ఆహా (Aha) లో

తమిళ కామెడీ డ్రామా మూవీ పేరు ‘రింగ్ రింగ్’ (Ring Ring). 2025 లో విడుదలైన ఈ మూవీకి దియా సినీ క్రియేషన్స్, రూల్ బ్రేకర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై శక్తివేల్, జగన్ నారాయణన్ కలిసి దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రంలో వివేక్ ప్రసన్న , సాక్షి అగర్వాల్ , డేనియల్ అన్నీ పోప్ , ప్రవీణ్ రాజ్, అర్జునన్ , స్వయం సిద్ధ, సహాన, జమున వంటి నటులు నటించారు. ఈ మూవీ 31 జనవరి 2025 లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహా (Aha) ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

త్యాగి, శైలజ ఇద్దరు భార్యా భర్తలు శివ బర్త్ డే ఫంక్షన్ కి రెఢీ అవుతుంటారు. ఇంతలో త్యాగి కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరోకాద అతని ప్రియురాలు. భార్య పక్కన ఉండటంతో మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేస్తాడు.ఇక ఇద్దరూ కలసి పార్టీ కి వెళ్తారు. శివ పార్టీకి కదిర్ ని కూడా ఇన్వైట్ చేస్తాడు. ఇతనికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. జెన్నీ అనే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ,రంజని అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. అయితే రంజనికి పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో లివింగ్ రిలేషన్ లోనే ఉందామని చెప్తుంది. ఇక్కడే వాళ్లయిదారికీ గొడవ అవుతుంది. మరోవైపు శివ సుందర్ అనే ఫ్రెండ్ ని కూడా పార్టీ కి పిలుస్తాడు. అక్కడికి అందరూ జంటలతో వస్తే, సుందర్ సింగిల్ గా వస్తాడు. ఇక అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒకరి ఫోన్ లు ఒకరు సీక్రెట్ గా మాట్లాడటం మొదలు పెడతారు.

ఇలా మాటల్లో మామధ్య ఏ రహస్యాలు లేవంటూ, ఒకరి ఫోన్ లు ఒకరు చూసుకోవడం మొదలుపెడతారు. ఆ తరువాత అక్కడ ఉన్న అందరూ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటారు. చివరికి సుందరం కూడా ఒక అబ్బాయి తో రిలేషన్ లో ఉంటాడు. ఎందుకంటే అతను ఒక గే, ఆ విషయం కూడా అక్కడే తెలిసిపోతుంది. చివరికి బర్త్ డే ఫంక్షన్ చేసుకుంటున్న జంట కూడా వేరొకరితో రిలేషన్ పెట్టుకుని ఉంటారు. ఆ తరువాత గజి బిజి గందరగోళం ఏర్పడుతుంది. చివరికి ఈ సంబంధాలు బయటికి రావడం వల్ల ఎటువంటి పరిస్తితులు వస్తాయి ? మళ్ళీ వీళ్ళు కలసి జీవిస్తారా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : కంఫర్ట్ విమెన్ పేరుతో కన్నింగ్ పనులు … తల్లిదండ్రుల ముందే అమ్మాయిలపై ఘోరాలు

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×